ఆంధ్రప్రదేశ్‌

క్షయ రోగులకు నెలకు రూ.500 సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: క్షయను 2020 నాటికి రాష్ట్రం నుంచి తరిమికొట్టేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి శనివారం శ్రీకారం చుట్టారు. వ్యాధి నిర్మూలనకు, రోగులకు అత్యుత్తమ చికిత్సకు సంబంధించి వివిధ పథకాలను ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రతి క్షయ వ్యాధిగ్రస్తునికి పోషకాహారం కోసం డీబీటీ (డైరక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్) కింద ఇక నుంచి నెలనెలా రూ.500 అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ‘ఎండ్ టీబీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో టీబీ వ్యాధిగ్రస్తుల కోసం ‘ట్రీట్మెంట్ సపోర్ట్ సెంటర్’ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. వ్యాధిగ్రస్తులను గుర్తించడం, చికిత్స అందేలా చూడటం ఈ సెంటర్ల విధిగా పేర్కొన్నారు. అలాగే 234 సీహెచ్‌సీల్లో టీబీ యూనిట్లు సిద్ధం చేశామని చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 610 సీహెచ్‌సీ, పీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులలో కఫం తనిఖీ కేంద్రాలు నెలకొల్పుతున్నామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. క్షయను గుర్తించే అత్యాధునిక వ్యాధి నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో 65వేల మంది క్షయ వ్యాధితో బాధపడుతున్నట్టు గుర్తించి, చికిత్స అందిస్తున్నామని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందేవారితో కలుపుకుంటే ఈ సంఖ్య లక్ష వరకు ఉండొచ్చని అన్నారు. వీరందరిని ‘నిక్షయ్’ సాఫ్ట్‌వేర్ ద్వారా ఆన్‌లైన్‌లో పర్యవేక్షిస్తామని చెప్పారు.
ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా నమోదు తప్పనిసరి
ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందే వారి వివరాలను సైతం తప్పనిసరిగా ప్రభుత్వానికి తెలియచేసేలా ఆదేశాలు జారీ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. దీంతో వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా టీబీ మందులు విక్రయించకుండా చూడాలని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యలతో ఈ ఏడాదిలో 30 శాతం నుంచి 40 శాతం వ్యాధిగ్రస్తులకు పూర్తిగా నయం చేయగలుగుతామని ముఖ్యమంత్రితో అధికారులు అన్నారు. క్షయ వ్యాధి నివారణపై ప్రజా చైతన్యానికి రూపొందించిన కరపత్రికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, ముఖ్యమంత్రి కార్యదర్శ గిరిజా శంకర్, పబ్లిక్ హెల్త్ డైరక్టర్ ఎస్.అరుణకుమారి, రాష్ట్ర క్షయ వ్యాధి నివారణ అధికారి టి.రామారావు పాల్గొన్నారు.

చిత్రం..క్షయ వ్యాధి నివారణ కరపత్రికను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు