రాష్ట్రీయం

మావోల చేతిలో సరికొత్త రాకెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జూన్ 27: ఇటీవలే రాకెట్ లాంచర్లతో పోలీసులపై విరుచుకుపడ్డ మావోయిస్టులు తాజాగా సరికొత్త ఆయుధంతో కలకలం సృష్టించారు. చిన్నపాటి రాకెట్‌ను పోలి ఉన్న ఈ ఆయుధానికి బాంబును అనుసంధానం చేసి శత్రువుపై ఉపయోగించడానికి సిద్ధం చేశారు. బస్తర్ అటవీ ప్రాంతంలోని కాంకేర్ జిల్లా మిర్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెర్లీ అవుట్ పోస్టుపై మావోలు ఆదివారం దీన్ని ప్రయోగించారు. అయితే పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో పెనుముప్పు తప్పింది. దీని శకలాలను పోలీసు ఉన్నతాధికారులకు పంపించారు. రాకెట్ ప్రొఫెల్లెంట్ బాంబుగా దీన్ని గుర్తించారు. వేసవి ముగిసి చెట్లు చిగురించగానే నక్సల్స్ దాడులకు తెగబడుతున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం విజయపురికాలనీ వద్ద జాతీయ రహదారి పక్కనే ప్రెషర్ బాంబును పేల్చారు. రెండు రోజులు తిరగక ముందే మండల కేంద్రం చర్లలోని పూజారిగూడెంలో బంద్ సందర్భంగా క్లెమోర్ మైన్ పేల్చి కరపత్రాలు వదిలి పోలీసులకు మరో సవాల్ విసిరారు. దండకారణ్యంలోని తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఆంధ్రా సరిహద్దుల్లో మావోయిస్టులు దాడులు తీవ్రతరం చేస్తుండటంతో కేంద్ర హోంశాఖ ఈ ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.