ఆంధ్రప్రదేశ్‌

సకాలంలో ప్రాజెక్టులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 18: ఆంధ్రప్రదేశ్‌లో సుస్ధిర వ్యవసాయాభివృద్ధిని సాధించేందుకు , సమ్మిళిత అభివృద్ధిని సాధించేందుకు ఎంత డబ్బు ఖర్చయినా సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తద్వారా రాష్ట్ర ప్రజల ఆర్ధిక వెసులుబాటు కల్పిస్తామని నీటిపారుదల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. పలు ప్రాజెక్టులు వద్ద రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చేస్తున్నారని, పైసా చెల్లించకున్నా ముందు ప్రాజెక్టుల నిర్మాణం జరగాలని వారు కోరుకుంటున్నారని మంత్రి చెప్పారు. వంశధార జలాలను సోంపేట వరకూ తరలిస్తామని, తోటపల్లి నీరు విజయనగరం జిల్లాకు ఇస్తామని, రాష్ట్రాన్ని అద్భుత రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. శుక్రవారం నాడు శాసనసభలో డిమాండ్లపై జరిగిన చర్చకు మంత్రి బదులిచ్చారు. నీటి పారుదల సౌకర్యాలను పెంచినపుడు వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఉత్పాదకత పెరుగుతుందని మారుతున్న పరిస్థితులను తట్టుకొని, రైతులకు లాభసాటిగా ఉండేవిధంగా తీర్చిదిద్దేందుకు వీలుకలుగుతుందని వెల్లడించారు.
భారీగా వ్యవసాయ బడ్జెట్
2016-17 సంవత్సరానికి గాను రూ.16250.58 కోట్లతోవ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి పత్తిపాటి పుల్లారావు శాసనసభలో చెప్పారు. సమగ్ర వ్యవసాయ అభివృద్ధికిగాను రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేసినట్లు పుల్లారావు చెప్పారు. రైతు రుణమాఫీ వాగ్దానానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ ఇప్పటి వరకు రూ.7,433 కోట్ల మొత్తాన్ని విడుదల చేసి 35.15 లక్షల మంది రైతు కుటుంబాలకు చెందిన 54.06 లక్షల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. మిగిలిన రుణ ఉపశమన అర్హత ఉన్న మొత్తానికి 4 వార్షిక వాయిదాలల్లో 10 శాతం వడ్డీతో సహా ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి తెలిపారు. ఉద్యాన పంటలకు కూడా ఎకరానికి రూ.10 వేల వరకు గరిష్టంగా రూ.50 వేల వరకు ఒక కుటుంబానికి 5 ఎకరాలకు మించకుండా రుణమాఫీ వర్తింప చేసేందుకు హామీ ఇచ్చామని తెలిపారు. దీనిలో భాగంగా రుణ ఉపశమన రెండవ దశ చెల్లింపుల కోసం రూ.3512 కోట్లు మొత్తాన్ని కేటాయించినట్లు మంత్రి పుల్లారావు వెల్లడించారు. దీనిలోనే ఉద్యానశాఖకు 2015-16కి గాను రూ.550 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కాగా వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు ప్రణాళిక వ్యయం కింద రూ.7691.90 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ.8558.68 కోట్లు బడ్జెట్‌ను ప్రతిపాదించామని అన్నారు. వ్యవసాయ క్షేత్ర యాంత్రీకరణ కోసం రూ.161.25 కోట్లు, పొలం పిలుస్తోంది, చంద్రన్న రైతు క్షేత్రాల ప్రదర్శనలకు రూ.15.50 కోట్లను కేటాయించారు. పంటల బీమా పథకం కోసం రూ.344 కోట్లను కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాకు రూ.3 వేల కోట్లతో ప్రతిపాదించామని, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.139.92 కోట్లు ప్రణాళికేతర కింద, రూ.40 కోట్లు ప్రణాళిక కింద ప్రతిపాదించామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతాంగానికి అభివృద్ధి ఫలాలను అందిస్తూ వ్యవసాయ దాని అనుబంధ రంగాల సమగ్ర ప్రయత్నాల ద్వారా ‘ప్రాధమిక రంగ మిషన్’లో భాగంగా అధిక వృద్ధి రేటు సాధించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.