బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీలో ఆన్‌లైన్ సభ్యత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 28: హైదరాబాద్‌లోని బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీ ఆన్‌లైన్ సభ్యత్వాన్ని స్వాగతిస్తోంది. 5 లక్షల పేపర్ బ్యాక్ కాపీలు, పుస్తకాలు, సినిమాలు, మ్యాగజైన్లు, ఈవెంట్లు, వర్కుషాప్‌లు, ఇ పుస్తకాలు, ఇ జర్నల్స్, ఇ సినిమాలు సహా ఒక గ్రంథాలయంలా కాకుండా ప్రపంచాన్ని ఆవిష్కరించేలా బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీని తీర్చిదిద్దారు. ఇందులో డిజిటల్ లైబ్రరీకి సభ్యత్వాన్ని స్వాగతిస్తున్నట్టు రాజేశ్వరి ప్రదీప్‌కుమార్ చెప్పారు. ఇ లైబ్రరీలో ఇ లెర్నింగ్ మాడ్యూల్స్ అందుబాటులో ఉన్నాయని, స్వీయ అభివృద్ధికి, అన్ని వయస్సుల వారికీ కామిక్స్, మైక్రోసాఫ్ట్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ప్రోగ్రామింగ్‌తో పాటు ఫోటోషాపీ, అడోబ్ తదితర శిక్షణ కౌశలాలకు వీలుగా రూపొందించారు. 80 ప్రచురణ కర్తల నుండి 7వేల గ్రాఫిక్ నవలలు, ఇండిఫిక్స్ పేరిట సినిమాలు, జినియో పేరిట అంతర్జాతీయ డిజిటల్ మ్యాగజైన్లు, ఇ లైబ్రరీ పేరిట లక్ష 20వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని ఆమె వివరించారు. 7వేల జర్నల్స్ కూడా చదువుకునే వీలుందని, ఆన్‌లైన్‌లో కావాల్సిన సాహిత్యం చదువుకోవచ్చని, అలాగే నాలుగువేల దినపత్రికలు చదువుకునే వీలుందని చెప్పారు.
లైబ్రరీ డాట్ బ్రిటిష్ కౌన్సిల్ డాట్ ఆర్గ్ డాట్ ఇన్ అనే వెబ్ సైట్‌లోకి లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు. బ్రిటిష్ కౌన్సిల్ వంద దేశాల్లో ఉందని, 7 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారని, అందులో 2 వేల మంది టీచర్లు కూడా ఉన్నారని పేర్కొన్నారు.