ఆంధ్రప్రదేశ్‌

శ్రీసిటీని సందర్శించిన షియామి ప్రతినిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరదయ్యపాల్యెం/తడ, ఏప్రిల్ 12: నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దులో ఉన్న శ్రీసిటీ పారిశ్రామిక వాడను అతి పెద్ద స్మార్ట్ఫోన్ తయారీ సంస్ధ షియామికి చెందిన 100 మంది ప్రతినిధులు బుధవారం శ్రీసిటీని సందర్శించారు. షియామి కమ్యూనికేషన్ కో వైస్ ప్రెసిడెంట్ వెర్న్‌జాంగ్, డైరెక్టర్ జానీవూ సారధ్యంలో శ్రీసిటీలోని పలు పరిశ్రమలను వారు సందర్శించారు. వీరికి శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి స్వాగతం పలికి శ్రీసిటీ ప్రగతిని వివరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ ఇక్కడ ఏర్పాటు కావడం మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా తిరుపతి, చెన్నయ్ వృద్ధి చెందడంతో ఈప్రాంతం పెట్టుబడి దారులకు అత్యంత అనువైన ప్రాంతంగా అవతరించిందన్నారు. శ్రీసిటీలో ఒక ఎలాక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతోపాటు రాష్ట్రప్రభుత్వం పారిశ్రామిక ప్రోత్సాహక ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ మ్యానిఫ్యాక్చరింగ్ పరిశ్రమలు శ్రీసిటీవైపు దృష్టి సారించాయన్నారు. ప్రత్యేక ఈఎంసీ జోన్ ఏర్పాటు ద్వారా రీసెర్చ్, డిజైన్, అసెంబ్లింగ్ తయారీ సంస్థలను నెలకొల్పనున్నట్లు చెప్పారు. ఇందుకోసం పర్యావరణహిత వాతావరణంలో వంద ఎకరాలను కేటాయించామన్నారు.