ఆంధ్రప్రదేశ్‌

హ్యాపీ..హ్యాపీగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 12: ప్రపంచ వ్యాప్తంగా మానవ వికాసానికి విఘాతం కల్పిస్తున్న అంశాలు.. ఆనందమయ జీవనానికి అనుసరించాల్సిన మార్గాలు.. ప్రభుత్వ.. ప్రజల కర్తవ్యాలు కలగలిపి గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న హ్యాపీ సిటీస్ సమ్మిట్-2018 గురువారంతో ముగిసింది. గత మూడు రోజులుగా సింగపూర్, ఫిన్‌లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, భూటాన్, ఆస్ట్రేలియా, కోస్టారికా తదితర దేశాల నుంచి తరలి వచ్చిన ప్రతినిధులను ప్రభుత్వం ఒక వేదికపై చేర్చి అనుభవాలను పంచుకోవటం ద్వారా భవిష్యత్తులో నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చి దిద్దే అవకాశం లభించింది. మొత్తం 15 దేశాల నుంచి 120 మంది ప్రతినిధులు.. రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులు, దేశంలోని ప్రముఖ రంగాలకు చెందిన నిష్ణాతులు హాజరైన ఈ సదస్సులో అందమైన అమరావతి నిర్మాణం సంతోష నగరాలకు అనుసరించాల్సిన ఆరు కీలక అంశాలతో డిక్లరేషన్‌ను ప్రకటించారు. భిన్న సంస్కృతుల మేళవింపుకు ప్రతిబింబంగా భారతీయ సమాజం నిలుస్తుందని ప్రధానంగా సదస్సుకు హాజరైన తమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రజలు అందించిన ఆతిథ్యం మరువలేనిదని విదేశీ ప్రతినిధులు ప్రశంసించారు. మూడురోజులుగా పిచ్ కాంపిటేషన్స్ ద్వారా కొన్ని అంశాలను ప్రభుత్వం గ్రహించింది.. సంతోష నగరాల్లో ఆర్థిక అభివృద్ధి.. ఉపాధి కల్పన.. పర్యావరణ పరిరక్షణ.. పాలనా సౌలభ్యం తదితర అంశాలపై ప్రతినిధులు పలు సూచనలు చేశారు. డిక్లరేషన్‌లో సూచించిన ఆరు అంశాల వివరాలిలా ఉన్నాయి. సుపరిపాలన (గవర్నెన్స్) అన్ని రంగాల్లో పారదర్శక పాలన, పౌరుల బాధ్యత ఉండాలని గుర్తించారు. మారుతున్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నగర ప్రణాళిక, వౌలిక సదుపాయాలు..విధి విధానాలకు రూపకల్పన చేయాల్సి ఉంటుంది. రెండవది (బిల్ట్ ఎన్విరాన్‌మెంట్) పర్యావరణ హితమైన సమాజ నిర్మాణం జరగాలి. ప్రజల జీవన స్థితిగతులు.. కాలుష్యరహిత రవాణా వ్యవస్థతో పాటు నడక, ధ్యాన మందిరాల ద్వారా ప్రజలకు మానసిక ఉల్లాసం కలుగుతుంది.. ప్రజావ సరాలకు అనుగుణంగా గృహ నిర్మాణం జరగాలి. మూడవది (నాచురల్ ఎన్విరాన్‌మెంట్) సహజవనరులైన నదులు, అటవీ.. కొండ ప్రాంతాలను పరిరక్షించుకుంటూ .. పార్కుల ఏర్పాటు, జలపాతాల ద్వారా ఆహ్లాదకరమైన అనుభూతులను పంచే విధంగా ప్రభుత్వాలు కార్యాచరణ రూపొందించాలి. నాలుగవది (ఎకానమీ అండ్ లైలీ హుడ్) ఆర్థిక వ్యవస్థ..ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల పర్యవేక్షణ ఉండాలి. అంతర్గత పారిశ్రామిక, వ్యాపార వ్యవస్థలను ప్రోత్సహించడంతో పాటు సామాజిక అసమానతలను తొలగించాలి. ఐదవది కల్చరల్ అండ్ కమ్యూనిటీ (సంస్కృతీ..సమాజం) ప్రాచీన సంస్కృతీ, సంప్రదాయాలు..కళలు భావితరాలకు మార్గదర్శకంగా నిలిచే విధంగా సంరక్షించుకోవాలి. చివరగా శారీరక, మానసిక ఉల్లాసం (్ఫజికల్ అండ్ మెంటల్ వెల్‌బీయింగ్) ప్రజల్లో పాజిటివ్ దృక్పధం పట్ల అవగాహన కల్పించటంతో పాటు పౌష్టికాహారం.. సత్ప్రవర్తన.. విధుల పట్ల అంకితభావం.. పరిశుభ్రత.. జీవన భద్రతకు అనుసరించాల్సిన విధాన రూపకల్పన జరగాలని ప్రపంచ దేశాల ప్రతినిధుల సదస్సు నిర్ణయించింది.