ఆంధ్రప్రదేశ్‌

తొలిసారి గ్రేడింగ్ విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 12: ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అత్యధిక శాతం ఏ గ్రేడులో ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫలితాల్లో ఈ ఏడాది నుండి తొలిసారిగా గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టారు. ఏ, బీ, సీ, డీ అనే నాలుగు గ్రేడుల విధానాన్ని ప్రవేశపెట్టారు. 75 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారిని ఏ గ్రేడుగా, 60 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చినవారిని బీ గ్రేడుగా, 50 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారిని సీ గ్రేడుగా, 35 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారిని డీ గ్రేడుగా వర్గీకరించారు. ఈ ఏడాది మొత్తం 4,41,359 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 3,23,645 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 1,97,183 మంది విద్యార్థులు ఏ గ్రేడులో, 84,690 మంది బీ గ్రేడులో, 32,240 మంది సీగ్రేడులో, 9,532మంది డీ గ్రేడులో ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 2,22,423 మంది బాలికలు పరీక్షలు రాయగా 1,17,454 మంది ఉత్తీర్ణులై 77 శాతం ఉత్తీర్ణత సాధించారు. 2,18,936 మంది బాలురు పరీక్ష రాయగా 1,52,191 మంది ఉత్తీర్ణులై 70 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక ఒకేషనల్ కోర్సుకు సంబంధించి 29,273 మంది పరీక్ష రాయగా 19645 మంది ఉత్తీర్ణులై, 67 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 13,209 మంది ఏ గ్రేడులో 6,155 మంది బీగ్రేడులో, 257మంది సీ గ్రేడులో, 14మంది డీ గ్రేడులోఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ విభాగంలో మొత్తం 14647 మంది బాలికలు పరీక్ష రాయగా 10,753 మంది ఉత్తీర్ణులై, 73 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక బాలురలో 14,626 మంది పరీక్షలు రాయగా 8892 మంది ఉత్తీర్ణులై, 61 శాతం ఉత్తీర్ణత సాధించారు.