ఆంధ్రప్రదేశ్‌

అక్టోబర్‌లో చంద్రయాన్-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఏఫ్రిల్ 12: దేశీయ నావిగేషన్ దిక్సూచి వ్యవస్థ సేవల కోసం త్వరలో యాప్‌ను విడుదల చేయనున్నట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ చెప్పారు. గురువారం పీఎస్‌ఎల్‌వీ-సీ 41 రాకెట్ ప్రయోగ విజయనంతరం ఆయన శాస్తవ్రేత్తలతో కలసి మీడియా సెంటర్‌లో విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శివన్ ఈ ఏడాది మిగతా 8నెలల్లో మరో 9ప్రయోగాలు షార్ కేంద్రం నుంచి చేపట్టనున్నట్లు వెల్లడించారు. అక్టోబర్‌లో మాసంలో చంద్రయాన్-2 ప్రయోగం ఉంటుందని, ఇది ఇస్రోకు పెద్ద సవాల్‌తో కూడిన పనన్నారు.
అదే జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3 ద్వారా కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. నావిగేషన్‌కు విడుదల చేసే యాప్‌డౌన్‌లోడ్ ద్వారా వాతారణ పరిస్థితుల హెచ్ఛరికలు మత్య్సకారులకు ముందుగా తెలుసుకోవచ్చునన్నారు. విపత్తు నిర్వహణ, వాహనాల గమనం, సముద్రంలో ఓడల కదలికలను తెలుసుకొనేందుకు ఈ ప్రయోగం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. దిక్సూచి వ్యవస్థ ద్వారా సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులకు చాలా ఉపయోగం కలుగుతుందన్నారు. ఈ ఉపగ్రహం ద్వారా దృశ్య వాయిస్ దిక్సూచి సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రయోగ విజయంతో దేశీయ నావిగేషన్ వ్యవస్థ వినియోగానికి మార్గం సుగుమం అయిందని తెలిపారు. ఇప్పటి ప్రాంతీయ స్థాయికే ఉన్న నావిగేషన్ సేవలు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందన్నారు. అంతేకాకుండా పర్వతారోహకులు, పర్యాటకులకు ఇది మరింత ఉపయోగపడడమే కాకుండా సమయాన్ని కూడా కచ్చితంగా తెలుసుకోవచ్చునన్నారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్య్సకారులకు బ్లూటూత్ ద్వారా మత్స్యకారుల ఫోన్లకు ఈ రిసీవర్లను అనుసంధానం చేయడం ద్వారా సముద్రంలో నిర్థిష్టంగా ఎక్కడ ఉన్నారన్న దాని పై యాప్ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహం సందేశం పూర్తిస్థాయిలో అందిస్తుందని పేర్కొన్నారు. షార్ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్ మాట్లాడుతూ ఇది దేశ ప్రజలకు ఇస్రో టీమ్ అందించిన మంచి విజయమని అభివర్ణించారు. ఇలాంటి ప్రయోగాలే మును ముందు ఇస్రో చేపట్టేందుకు సన్నాహాలు చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపగ్రహ డైరెక్టర్ వి.రామనాధన్, శాస్తవ్రేత్తలు అన్నాదురై, హట్టన్,సోమనాధ్ తదితరులు పాల్గొన్నారు.