ఆంధ్రప్రదేశ్‌

ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 12: ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు పరీక్షలు ముగిసిన 24 రోజుల్లోనే వెల్లడించామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని ఓ హోటల్‌లో గురువారం మధ్యాహ్నం మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదలచేశారు. పరీక్షా ఫలితాల సీడీని ఆవిష్కరించి, పాస్‌వర్డును వెల్లడించారు. ఈ ఏడాది 73.33 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇది గత ఏడాది 77 శాతంతో పోలిస్తే దాదాపు నాలుగు శాతం తక్కువ. కాగా మొత్తం అన్ని జిల్లాల్లో గ్రూపుల్లో బాలికలదే పైచేయిగా ఉంది.
* ఎంపీసీలో పూనం తేజ 992 మార్కులతో ప్రథమ స్థానం సాధించారు. 991 మార్కులతో ఆఫ్రిన్ షేక్ ద్వితీయ, 990 మార్కులతో దాయిలపల్లి సుష్మ తృతీయ స్థానంలో నిలిచారు.
* బైపీసీలో 990 మార్కులతో ముక్కు దీక్షిత ప్రథమ స్థానంలో నిలవగా, 990 మార్కులతో లక్ష్మీ కీర్తి, 990 కె శ్రీముఖ ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.
* ఎంఈసీలో 990 మార్కులతో నిషాంత్ కృష్ణ ప్రధమ స్థానంలో నిలవగా, 981 మార్కులతో మీనా, 981 మార్కులతో అభిషేక్ ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.
* సీఈసీలో 968 మార్కులతో కారంపల్లి గీత ప్రథమ స్థానంలో నిలవగా, 966 మార్కులతో అదులాపురం సెల్వరాజ ప్రియ, 964 మార్కులతో కె శ్రీరామ్ ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచారు.
* ఉత్తీర్ణతా శాతానికి సంబంధించి 84 శాతంతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, 77 శాతంతో నెల్లూరు, 76 శాతంతో గుంటూరు జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచాయి. 59 శాతం ఉత్తీర్ణతతో కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మొత్తం 4,41,359మంది పరీక్షలు రాయగా 3,23,645 మంది ఉత్తీర్ణులయ్యారు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల విభాగంలో విజయనగరం జిల్లా 85 శాతం, నెల్లూరు, శ్రీకాకుళం 70, చిత్తూరు 65 శాతం ఉత్తీర్ణత సాధించాయి. కనిష్ఠ స్థాయిలో విశాఖ జిల్లా 47 శాతం ఉత్తీర్ణత సాధించింది.
ఎయిడెడ్ విద్యా సంస్థల్లో అత్యధిక ఉత్తీర్ణత సాధించిన జిల్లాల్లో చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు అగ్రస్థానంలో నిలిచాయి. 37 శాతంతో విజయనగరం జిల్లా చివరిస్థానంలో నిలిచింది. మే 14న ఇన్‌స్టెంట్ సప్లిమెంటరీ నిర్వహిస్తామని, దీనికి ఫీజు చెల్లించడానికి ఆఖరు తేదీ ఈ నెల 24వ తేదీ అని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఉదయలక్ష్మి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ డీరమేష్, సంయుక్త కార్యదర్శి పి మురళీధర్, దివాకర్, అమలాపురం ఎంపీ పండుల రవీంద్ర, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు.