రాష్ట్రీయం

వర్శిటీలకు స్వయంపాలన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 29: ప్రస్తుత ప్రభుత్వం ఈ రాష్ట్రానికి తామే శాశ్వతం అనుకుంటోందని, మంచి పనులు చేయకుంటే మిలియన్ మార్చ్ సంగతి అందరికీ తెలుసని ప్రముఖ సామాజిక శాస్తవ్రేత్త ప్రొఫెసర్ హరగోపాల్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ జాక్ నేతలు నిర్వహించిన సదస్సులో ఆయన బుధవారం మాట్లాడారు. యూనివర్శిటీలకు స్వయంప్రతిపత్తి (అటానమీ) ఉండటం వల్లనే మనం ప్రొఫెసర్ కోదండరామ్‌ను, ప్రొఫెసర్ జయశంకర్‌ను చూడగలిగామని, అప్పుడే వారిని అణచివేసి ఉంటే నేడు వారిని చూసేవారం కాదని అన్నారు. ఉన్న సమయంలో మంచి పనులు చేస్తే ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలవుతారని, లేకుంటే మిలియన్ మార్చ్‌లో విగ్రహాలవుతారని పేర్కొన్నారు. పదేళ్ల తర్వాత ఈ ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటారోననే స్పృహ ఉండాలని హరగోపాల్ వ్యాఖ్యానించారు. తాము బాధ్యతగా చెబుతున్నామని, హృదయపూర్వకంగా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వదలచుకున్నామని, ప్రభుత్వం చేసే అన్ని పనులను వ్యతిరేకించే ఆలోచన తమకు లేదని, అయితే ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణానికి పూనుకోవాలని అన్నారు. అత్యవసరంగా తెలంగాణ విద్యారంగాన్ని గాడిన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. నెపాన్ని ప్రభుత్వం మీదకే నెట్టడం లేదని, విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలను విశే్లషించి శాశ్వత పరిష్కారానికి ప్రయత్నించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. కార్పొరేట్లను నివారించి, ప్రైవేటు కాలేజీలను నియంత్రించి, ప్రభుత్వ కాలేజీలను, విద్యాసంస్థలను ప్రోత్సహించాల్సి ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు తక్కువ ఖర్చుతో లేదా ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాల్సి ఉందని చెప్పారు. గత పాలకుల విధానాలను అనుసరించకుండా స్థానిక అవసరాలకు అనుగుణంగా నూతన విద్యావిధానాన్ని రూపొందించాల్సి ఉందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలు, పేద బాలబాలికలకు నాణ్యమైన విద్య అందడం ముఖ్యమని అన్నారు. ప్రాథమిక విద్య పిల్లలందరి హక్కు అని జాతీయ అంతర్జాతీయ సంస్థలు చెబుతూనే ఉన్నాయని, ఆ దిశలో ప్రభుత్వం గట్టి కృషి చేయాల్సి ఉందని అన్నారు. తెలంగాణ విద్యారంగం అభివృద్ధికి సూచనలు, నిర్మాణాత్మక సహకారం అందించేందుకు చాలా మంది మేధావులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.