ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక హోదా ఉద్యమంలోకి ఇక కళాకారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 16: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా సినిమా, నాటక రంగానికి చెందిన కళాకారులతో ఢిల్లీలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని రాష్ట్ర చలనచిత్ర టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ అంబికా కృష్ణ తెలిపారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఉద్యమాలకు మద్దతుగా టీవీ చలనచిత్ర మండలికి చెందిన కళాకారులు ఒకరోజు దేశ రాజధాని ఢిల్లీలో నిరసన తెలియజేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజాలతో ఈ విషయమై చర్చించామన్నారు. తొలుత ఈనెల 22న ఢిల్లీలో తెలుగు కళాకారులందరితో భారీ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయంచామన్నారు. ఒకటి రెండు రోజుల్లో సినీ ప్రముఖులతో సమావేశమై ప్రత్యేక హోదా నిరసన కార్యక్రమానికి రూపకల్పన చేసి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. విజయవాడలో కళాకారులందరితో ఒకరోజు పాదయాత్ర కార్యక్రమం నిర్వహించి నిరసన తెలియజేస్తామన్నారు.