ఆంధ్రప్రదేశ్‌

ఒకేసారి రైతులకు 2 లక్షల రుణ మాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లందు, ఏప్రిల్ 16: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఒకేసారి 2 లక్షల రుణ మాఫీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ప్రజా చైతన్య యాత్ర 2వ విడతలో భాగంగా సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యాత్రను కొనసాగించారు. ఇల్లందులో భారీ ప్రదర్శన అనంతరం హైస్కూల్ గ్రౌండ్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ యుపిఎ పాలనలో ఒకేసారి 36వేల కోట్ల రూపాయలను రైతులకు రుణ మాఫీ చేసిందని గుర్తు చేశారు. అమలు కాని హామీలతో ప్రజలను మభ్యపెడుతున్న కెసిఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని విమర్శించారు. మిషన్ భగీరధ పేరుతో కమీషన్‌లకు కక్కుర్తిపడి వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఉత్తమ్ అన్నారు. రానున్న ఎన్నికల్లో ఓటు వేటుతో కెసిఆర్ పాలనకు చరమగీతం పాడాలని కోరారు. కాంగ్రెస్ టిక్కెట్టుపై గెలిచి టిఆర్‌ఎస్‌లో చేరిన ఇల్లందు ఎంఎల్‌ఎ కోరం కనకయ్య తీరుపై ఉత్తమ్ మండిపడ్డారు. ఈ సభలో కేంద్ర మాజీ మంత్రులు రేణుకాచౌదరి, పోరిక బలరాంనాయక్, రాష్ట్ర నేతలు భట్టి విక్రమార్క, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, సిహెచ్ హనుమంతరావు, డి మాధవ్‌రెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, సంభాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.