ఆంధ్రప్రదేశ్‌

ఇదే స్ఫూర్తి కొనసాగిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ చేపట్టిన ఒక రోజు బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రాష్ట్ర ప్రజలకు జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పనిసరి, ఇది తాము సాధించుకున్న హక్కు అనే ప్రజానీకం అభీష్టాన్ని ఈ బంద్ వెల్లడించింది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం శాంతియుతంగా సాగిందని, ఇదే స్ఫూర్తితో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని పవన్ పేర్కొన్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే బంద్‌లు తమ పార్టీ విధానం కాదని, అయినా ప్రత్యేక హోదా సాధన మన రాష్ట్రానికి చాలా ముఖ్యమైనది కనుక నిరసన బలంగా వెల్లడించడానికి ప్రత్యేక హోదా సాధన సమితి బంద్ పిలుపునకు మద్దతుగా నిలిచామని అన్నారు.