ఆంధ్రప్రదేశ్‌

బంద్ విఫలానికి చివరి వరకూ యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 16: ప్రత్యేక హోదా సాధనకై ఐదుకోట్ల మంది ప్రజలు సోమవారం నిర్వహించిన రాష్ట్ర బంద్‌ను ఏదో విధంగా విఫలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అర్ధరాత్రి వరకు అన్ని రకాల ప్రయత్నాలు చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆశ్చర్యకరం ఏమిటంటే ముందెన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బంద్‌కు పిలుపునిచ్చిన వామపక్షాలు, వైకాపా, జనసేన, కాంగ్రెస్ నేతలు ముఖ్య కార్యకర్తలందరికీ ఎక్కడికక్కడ పోలీసుల ద్వారా నోటీస్‌లు వెళ్లాయి. ఈ నోటీస్‌లోని సారాంశం ఏమిటంటే.. బంద్ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరుల వల్ల సామాన్య ప్రజల ప్రశాంత జీవనానికి అంతరాయం కల్గినా, ట్రాఫిక్‌కు అంతరాయం కల్గినా ప్రభుత్వ, ప్రజల ఆస్తులను ధ్వంసం చేసినా, నష్టం కలిగించినా పూర్తి బాధ్యత వహించాలి. పైగా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. ఆపై నష్టాన్ని నేతల ఆస్తి నుంచి జమ చేస్తామంటూ ఎస్‌ఐల పేరిట నోటీస్‌లు జారీ అయ్యాయి. ఈ నోటీసులు చూసి పలువురు నేతలు భయపడితే మరికొందరు సవాల్‌గా తీసుకుని బంద్ సక్సెస్‌కు నడుం కట్టారు. అయితే తెల్లవారుజాము సమయానికి ఎక్కడా అరెస్ట్‌లు వద్దనే సమాచారం రావటంతో పోలీసులు వెనక్కి తగ్గారు. దీంతో మిగిలినవారు కూడా రోడ్డెక్కారు. నాలుగేళ్లపాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చెట్టాపట్టాలు వేసుకుని నడచిన సీఎం చంద్రబాబు ఒక్కసారిగా ఎన్డీఏ నుంచి వైదొలగి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ ఉద్యమం చేపట్టి ‘యూటర్న్’ తీసుకున్నారు.. విపక్షాలు జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపునిస్తే దానికి పోటీగా సీఎం చంద్రబాబు సైకిల్‌యాత్రకు పిలుపునిచ్చారు. సీఎం, మంత్రులు స్వయంగా సైకిళ్లపై అసెంబ్లీకి చేరుకున్నారు. ఆ సమయంలోను గంటలకొద్దీ ట్రాఫిక్ స్తంభన జరిగింది. అంతెందుకు ప్రతి ఏటా సంకల్పయాత్ర పేరున విజయవాడలో జాతీయ రహదారుల కూడలి బెంజిసర్కిల్‌లో జరుగుతుంటే గంటలకొద్దీ ట్రాఫిక్ స్తంభించటం లేదా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అసలు రెండేళ్ల క్రితమే ప్రధాని మోదీ హోదా ఇచ్చేది లేదని చెప్పటం.. దానికి తందానా అంటూ ప్యాకేజీని స్వాగతిస్తూ చట్టసభల్లో మోదీకి అభినందన తీర్మానాలు ప్రవేశపెట్టించి హోదా పేరిట ఉద్యమాలు చేసిన వారిపై కేసులు నమోదు చేయించలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా హోదా ఉద్యమ కేసులన్నింటినీ ఎత్తివేయాలి కదా కోరుతున్నారు. 20తేదీన దీక్షలని చెబుతూ.. ఉద్యమానికి వెన్నుపోటు పొడిచే ఈ చర్యలేమిటని విపక్షాల నేతలు ధ్వజమెత్తుతున్నారు.