ఆంధ్రప్రదేశ్‌

ఇక్కడా మహిళలకు భద్రత కరవే: జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 16: ఆడబిడ్డలను కాపాడుకోవడంలో ఒక దేశంగా మనం విఫలం చెందామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కథువా, ఉన్నావ్‌ల్లో చోటుచేసుకున్న ఘోరాలు మానవత్వాన్ని మంటగలిపే సంఘటనలని పేర్కొన్నారు. మున్ముందు ఇలాంటి నేరాలు చేయాలన్న తలంపు కూడా ఏ ఒక్కరికీ రాని విధంగా నిందితులను కఠినంగా శిక్షించాలని అభిప్రాయపడ్డారు. కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్న జగన్ సోమవారం ఈమేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ మహిళలకు భద్రత కరువైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మానవత్వం మంటగలిసిందనడానికి కథువా, ఉన్నాప్ ఘటనలకన్నా వేరే సాక్ష్యాలు అక్కర్లేదన్నారు. ఆడపిల్లలను కాపాడుకోవడంలో ఒక దేశంగా మనం వైఫల్యం చెందామని, బాధాకరమైన విషయమేమిటంటే ఆంధ్రప్రదేశ్‌లోనూ పరిస్థితి అంతకు తీసిపోలేదన్నారు. గతేడాది అక్టోబర్ 17న వైజాగ్ రైల్వే కాలనీలో ఓ మహిళపై పట్టపగలే లైంగిక దాడి జరిగిందన్నారు. డిసెంబర్‌లో పెందుర్తిలో మరో దళిత మహిళను వివస్తన్రు చేసి దాడి చేశారన్నారు. ఈసారి నిందితులను అసలు విడిచిపెట్టొద్దంటూ విజ్ఞప్తి చేశారు.