ఆంధ్రప్రదేశ్‌

‘హోదా’ కోసం ఎపిలో విపక్షాల బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి బంద్ కొనసాగుతోంది. వైకాపా, వామపక్ష పార్టీలు బంద్‌కు పిలుపు ఇవ్వగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, కాకినాడ, విజయనగరం, అనంతపురం, కడప, కర్నూలు, ఒంగోలు, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ బస్సులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. విద్య, వ్యాపార సంస్థలు, సినిమా హాళ్లను మూసివేశారు. విజయవాడలో వామపక్ష పార్టీల కార్యకర్తలు బంద్‌కు మద్దతుగా బైక్‌ర్యాలీ జరిపారు. బంద్ నిర్వాహకులకు, పోలీసులకు మధ్య తోపులాటలు జరిగాయి. కొన్ని చోట్ల మహిళలను పోలీసులు రోడ్లపై ఈడ్చుకువెళ్లారు. పలు జిల్లాల్లో బస్సులను అడ్డుకుంటున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వల్ప ఘర్షణలు మినహా బంద్ సందర్భంగా ఎక్కడా ఇంతవరకూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.