రాష్ట్రీయం

30న ఏపి కేబినెట్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 30వ తేదీన విజయవాడలో జరగనుంది. అదే రోజు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా విజయవాడ రానున్నారు. ఆయన క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత 3 గంటలకు సిఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంశంతోపాటు అమరావతి మాస్టర్‌ప్లాన్ , ఏడు మిషన్ల పనితీరు, 2వ తేదీ నుండి జరిగే ‘జన్మభూమి - మీ ఊరు ’ కార్యక్రమం, పంటసంజీవని కార్యక్రమం కింద జిల్లాకు లక్ష చొప్పున 10 లక్షల ఫామ్ పాండ్స్ నిర్మాణం అంశం కూడా క్యాబినెట్‌లో చర్చకు రానుంది. ఎన్టీఆర్ జలసిరి, అందరికీ రేషన్ కార్డులు, రహదారుల నిర్మాణంపై మంత్రివర్గం చర్చించనుంది. జనవరి 1 నుండి పేదలకు వైద్య సాయం పథకం కింద ఉచిత హెల్త్ చెకప్ సేవలు, తాగునీటి ఏర్పాట్లు, క్లియర్ టైటిల్ భూముల రికార్డులు సిద్ధం చేయడం, ఆస్పత్రి ప్రసవాలు, జీరో డ్రాపవుట్లు, మాతాశిశు మరణాల నియంత్రణ, నూరుశాతం టాయిలెట్ల నిర్మాణం, బాల్య వివాహాల నియంత్రణ, ప్రతి కుటుంబానికి బ్యాంకు అకౌంట్ నిర్వహణ, కాల్‌మనీ అదుపు, చెట్లు పెంచే కార్యక్రమం, నర్సరీల నిర్వహణ, ప్రతి పంచాయితీలో ఫిర్యాదుల స్వీకరణ, స్మార్టు ఆంధ్రప్రదేశ్, దిగుబడుల పెంపు, సంక్రాంతికి ఊరూరా ఉత్సవాలు, ఫుడ్ ఫెస్టివల్ తదితర అంశాలపై మంత్రివర్గ చర్చిస్తుందని సమాచారం.