ఆంధ్రప్రదేశ్‌

ఎపి ఎంసెట్ ఫలితాల విడుదలపై ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: ఎపి ఎంసెట్ ఫలితాల విడుదలలో అనివార్యమైన జాప్యం జరుగుతోంది. ‘నీట్’పై ఈరోజు సాయంత్రంలోగా సుప్రీం కోర్టు తీర్పు వెలువడుతుందని భావించి ఎంసెట్ ఫలితాలను ప్రకటించేందుకు ఎపి ప్రభుత్వం సన్నాహాలు చేసింది. విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఎంసెట్ ఫలితాలను విడుదల చేసేందుకు గంటల తరబడి నిరీక్షించారు. ‘నీట్’పై సుప్రీం కోర్టు తీర్పు వెలువడితే, దానిపై న్యాయనిపుణులతో చర్చించి రెండు, మూడు గంటల్లోనే ఎంసెట్ ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి గంటా చెప్పారు. తీర్పు రావడంలో ఇంకా జాప్యం జరిగితే ఎంసెట్ ఫలితాలను మంగళవారం విడుదల చేస్తామన్నారు. ఫలితాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.