జాతీయ వార్తలు

ఏపి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు పలువురి ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ఆంధ్రప్రదేశ్‌లోని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. జనవరి 10వ తేదీ నుంచి విశాఖపట్నంలో మూడు రోజుల పాటు జరుగనున్న 22వ భాగస్వామ్య శిఖరాగ్ర సమావేశం (పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్) నేపథ్యంలో సోమవారం ఢిల్లీలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఏర్పాటు చేసిన పరస్పర చర్చల సమావేశానికి పలు ఫుడ్‌ప్రాసెసింగ్ సంస్థల అధిపతులు, ఎండిలు, సిఇఓలు హాజరయ్యారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ అధ్యక్షతన ఏపి భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి దాదాపు 12 ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల అధిపతులు హాజరయ్యారు. రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సంఘం సిఇఓ వైఎస్.ప్రసాద్, యస్ బ్యాంకు ఆహార, వ్యవసాయ వ్యూహకర్త నితిన్ పురి కూడా హాజరైన ఈ సమావేశంలో మొండెలెజ్ ఇండియా, ఓలం ఇంటర్నేషనల్, సర్గిల్, లుయిస్ డ్రెఫుస్, ఎన్‌సిఎంఎల్, జెకె అగ్రి, అల్లనాసన్స్, పర్ల్ బెవరేజెస్, సూర్య ఫుడ్స్, కిర్పారాం ఫుడ్స్, ఎకోలాబ్ ఫుడ్ సేఫ్టీ, ఆర్మొన్ ఇంటర్నేషనల్ తదితర సంస్థల అధిపతులు, సిఇఓలు చర్చల్లో పాల్గొని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలు, ఏపి ప్రభుత్వం కల్పించనున్న వసతులు, ఇతర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఫుడ్ ప్రాసెసింగ్ విధానం గురించి గిరిజా శంకర్ ఈ సమావేశంలో వివరిస్తూ, ఈ రంగంలో ప్రభుత్వం రూ.5 వేల కోట్ల పెట్టుబడులతో 50 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని యోచిస్తోందన్నారు. విశాఖలో జరిగే పెట్టుబడుల సమావేశానికి హాజరు కావలసిందిగా ఆయన ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలను ఆహ్వానించారు.