ఆంధ్రప్రదేశ్‌

కేంద్రం ఇచ్చేది ఇక 1500 కోట్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 1: రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సాయం చేస్తుందని కొండంత ఆశలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిరాశే మిగిలింది. రాజధాని నిర్మాణానికి కేంద్రం అందించే సాయం పెద్దగా లేదని తేలిపోయింది. అమరావతికోసం కేంద్రం కేవలం 2500 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తానందని శుక్రవారం విలేఖరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే ఇచ్చిన 1000 కోట్లు కూడా అందులో భాగమేనని ఆయన అన్నారు. ఈ మేరకు కేంద్రం నుంచి వచ్చేది మరో 1500 కోట్ల రూపాయలు మాత్రమేనని ఆయన కుండబద్దలు కొట్టారు. చైనానుంచి గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు, శుక్రవారం ఆర్థిక మంత్రిజైట్లీతో భేటీ అయిన సందర్భంగా ఈ విషయం తేటతెల్లమైనట్టు తెలిసింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి విలేఖరుల సమావేశంలో వెల్లడిస్తూ ఒకింత నిరాశానిస్పృహలు వ్యక్తం చేశారు. కేంద్రం ఇస్తానన్న 1500 కోట్లు రాజధానిలో తాము నిర్మిస్తున్న భూగర్భ విద్యుత్ వ్యవస్థకు కూడా చాలదని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం ఎలా చేపడతారన్న ప్రశ్నకు మన ముందున్న అవకాశాలన్నింటినీ పరిశీలిస్తున్నామని చెప్పారు. ‘రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చారు. వాటిలో కొంత భాగాన్ని తిరిగి వారికే ప్లాట్ల రూపంలో ఇస్తున్నాం. కొంత భాగంలోనే రాజధాని నిర్మాణం జరుగుతుంది. మిగిలిన భూమిని విక్రయించి నవ్యాంధ్ర రాజధానిని నిర్మిస్తాన’ని చంద్రబాబు స్పష్టం చేశారు.