రాష్ట్రీయం

అరకొర సౌకర్యాల మధ్య ఇంటర్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు/ప్రకాశం/చిత్తూరు: జిల్లా కేంద్రమైన చిత్తూరులో అరకొర సౌకర్యాల మధ్యనే ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నగరంలోని పలు పరీక్షా కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పలు కేంద్రాల్లో చీకటి గదులు, వరండాలు, డెస్క్‌లు లేకపోవడంతో నేలపై కూర్చుని పరీక్షలు రాయాల్సిన దుస్థితి నెలకొంది. చిత్తూరులోని పిసిఆర్ జూనియర్ కళాశాలలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కేంద్రంలో చీకటి గదిలోనే విద్యార్థులు పరీక్షలు రాయాల్సిన పరిస్థితి నెలకొనడంతో దీనిపై తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. వెంటనే ప్రిన్సిపాల్ ఆ గదిలో పరీక్షలు రాసే విద్యార్థులను వరండాలోకి మార్చారు. చిత్తూరు జిల్లా పెనుమూరు కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో ఇనుపరాడ్లు, బల్లల మధ్యలో విద్యార్థులు పరీక్షలు రాశారు. వెలుతురు లేని చీకటి గదుల్లోనే పరీక్ష రాయాల్సి రావడంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. ప్రకాశం జిల్లాలో బుధవారం జరిగిన జూనియర్ పరీక్షలకు సంబంధించి 1440 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలోని సమస్యాత్మాక కేంద్రాలపై ప్రత్యేక దృష్టిసారించారు. నెల్లూరు జిల్లాలో ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మినీ బైసాస్ రోడ్డులో ఉన్న విశ్వసాయి జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఎం జానకి పరిశీలించారు. పరీక్షలకు 1050 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. గూడూరు డివిజన్‌లో పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులు నానాతంటాలు పడ్డారు. విద్యార్థుల సౌలభ్యం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినా అవి సకాలంలో పలుచోట్ల పరీక్షా కేంద్రాలకు చేరుకోలేదు. నిముషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రానికి పలువురు విద్యార్థులను అధికారులు అనుమతించకపోవడంతో వారు కన్నీళ్ల పర్యంతమయ్యారు. బుచ్చిరెడ్డిపాళెంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తూ ఇద్దరు డిబార్ అయ్యారు.