ఆంధ్రప్రదేశ్‌

అన్నింటా ఉల్లంఘనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 1: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రోజు రోజుకూ తలెత్తుతున్న విభేదాలను పరిష్కరించడంలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోపోవడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. వీటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కూడా ఖండించారు. చైనా పర్యటన ముగించుకుని శుక్రవారం విజయవాడ వచ్చిన చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. విభజన చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, కృష్ణా జలాల పంపిణీ, హైకోర్టు విభజన, ఢిల్లీలో ఆంధ్రాభవన్ వివాదం వంటి అంశాలపై తెలంగాణ ప్రభుత్వ ధోరణిని ఎండగట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త కోర్టు నిర్మించుకున్నంత వరకూ ఇప్పుడున్న హైకోర్టునే వాడుకోవచ్చని విభజన చట్టంలో స్పష్టంగా ఉందని తెలిపారు. న్యాయస్థానాలకు ప్రత్యేక చట్టం ఉంటుందని, దాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం గౌరవించడం లేదని అన్నారు. హైకోర్టు విభజన సుప్రీం కోర్టు పరిధిలోని అంశమని, దీనిపై వివాదం ఎంత మాత్రం తగదని తెలిపారు. హైకోర్టును ఓ అద్భుతమైన కట్టడంగా నిర్మించాలన్నది తమ ఉద్దేశమని, ఎలాపడితే అలా కట్టేయలేమని తెలిపారు. ప్రతి విషయంలో తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని అన్నారు. విభజన చట్టం ప్రకారం తమకు రావల్సినవన్నీ తెలంగాణ ప్రభుత్వం కావాలంటోందని, ఎపికి చట్టబద్ధంగా రావల్సిన వాటిని ఇచ్చే విషయంలో తగాదాకు దిగుతోందని చంద్రబాబు అన్నారు. ‘ఇప్పుడు ఢిల్లీలోని ఎపి భవన్ కావాలంటున్నారు. గతంలో నేను ముఖ్యమంత్రిగా, వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లోని నిజాం మ్యూజియంను కేంద్రం తీసుకుంది.దానికి ప్రతిగా ఢిల్లీలో ఏడు ఎకరాల స్థలాన్ని ఏపి ప్రభుత్వానికి ఇచ్చింది. అందులోనే ఎపి భవన్‌ను నిర్మించాం’అని వివరించారు. అందరూ కలిసి కష్టపడి నిర్మించుకున్న దాన్ని టిఎస్ ప్రభుత్వం తీసుకోవాలనుకోవడం సరికాదని అన్నారు. తను తెలంగాణ ప్రభుత్వంతో ఘర్షణకు దిగాలనుకోవడం లేదని, న్యాయబద్ధంగా పంపకాలు జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అయి చర్చించుకునే అవకాశాలేమైనా ఉన్నాయా? అని విలేఖరులు ప్రశ్నించగా, తెలంగాణ ముఖ్యమంత్రితో చర్చలు జరిపేందుకు తనకేమీ భేషజాలు లేవని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇద్దరం కూర్చుని చర్చించుకుంటే ఏం ప్రయోజనం? కేంద్రం జోక్యం చేసుకోపోతే ఎలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కేంద్ర వద్దకు వెళ్లి ఇక్కడి ఇబ్బందులను పదే పదే చెపుతున్నానని, కానీ కేంద్రం పూర్తిగా సహకరించడం లేదని చంద్రబాబు అన్నారు. విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం కూడా సహకరించడం లేదని అన్నారు. రాష్ట్రాల మధ్య విభేదాలు కేంద్రానికే నష్టమని చంద్రబాబు ఘాటైన వ్యాఖ్య చేశారు. పంజాబ్ గోల్డెన్ టెంపుల్‌లో జరిగిన ఘటన వలన అక్కడి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని, అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని ఆయన అన్నారు. ఏకపక్ష చర్చల వలన ప్రయోజనం లేదన్న విషయాన్ని కేంద్రం గురించాలని అన్నారు.
ఇదిలా ఉండగా పాలారు నదిపై నిర్మాణాలను ఐదు అడుగుల నుంచి 12 అడుగులకు పెంచడంపై అభ్యంతరాలు తెలియచేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాసిన లేఖపై చంద్రబాబు స్పందిస్తూ చట్టంలో ఏవిధంగా ఉంటే అలాగే చేద్దామని తెలిపారు. రాజధాని నిర్మాణంలో అవినీతి జరుగుతోందని ప్రతిపక్ష నాయకులు ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు.‘జగన్ పదే పదే సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. ఆయన ఎలాగూ సిబిఐలో ఇరుకున్నారు కాబట్టి ఆయనతో పాటు అందరూ కలిసి ఉండాలనే ఈ విధంగా కోరుకుంటున్నాడా’అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. పొంతనలేని ప్రకటనలతో జగన్ మాట్లాడుతున్నారని అన్నారు.
chitram...
మీడియాతో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు