ఆంధ్రప్రదేశ్‌

జాడ లేని పసికందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 15:విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అదృశ్యమైన పసికందు జాడ రెండు రోజులు గడిచినా తెలియరాలేదు. పసికందుకోసం ఆరు పోలీసు బృందాలు వేర్వేరు ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నా ఫలితం లేదు. ఇదిలాఉండగా ఆసుపత్రి సమీపంలోని ఏలూరు కాలువలో మగ శిశువు మృతదేహం ప్రత్యక్షం కావటంతో కొంతసేపు ఆసుపత్రిలో కలకలం రేగింది. ఆసుపత్రిలో గల్లంతైన శిశువుదే ఆ మృతదేహం అని ప్రచారం జరగటంతో తల్లిదండ్రులు కల్యాణి, సుబ్రహ్మణ్యం రోదిస్తూ పరుగులు దీశారు. తీరా ఆ మృతదేహాన్ని పరిశీలించి తమ బాబు కాదంటూ వారు స్పష్టం చేశారు. మరోవైపు వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. పోలీసుల అదుపులోనున్న సెక్యూరిటీ గార్డును తమకు అప్పగించాలంటూ నినాదాలు చేశారు. మరోవైపు ఆర్‌టిసి బస్టాండ్‌లోని సిసి కెమెరాల ద్వారా పోలీసులు ఓ పసికందుతో కూడిన మహిళను గుర్తించి అనుమానం వ్యక్తం చేస్తూ మీడియాకు ఆ దృశ్యాలను విడుదల చేశారు. గుంటూరుకు చెందిన ధన్యశబరి ఫొటోను టివిలు, పత్రికల్లో చూసి ఆమె బంధుమిత్రులు ఆమెకు సమాచారం అందించారు. దీనిపై ఆమె స్పందిస్తూ సిసి కెమెరాల్లో తాను ఎత్తుకుని ఉన్నట్టు కనిపించిన పసికందు తన బిడ్డేనని స్పష్టం చేశారు. తన కుమారుడుకి ఆరుమాసాలున్నాయని, తేజా రేవంత్ పవన్ అని నామకరణం కూడా చేయటం జరిగిందన్నారు. తాను ఏదో పనిపై విజయవాడ వెళ్లి గుంటూరు వచ్చేందుకు బస్టాండుకు రాగా, సిసి కెమెరాల్లోంచి తన విజువల్‌ను తీసి, అభాసుపాలు చేశారంటూ పోలీస్‌శాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై పరువునష్టం కేసు దాఖలు చేస్తానని హెచ్చరించారు. ఆమె గుంటూరు రైలుపేటలో ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ నివాస భవనానికి సమీపంలో ఉంటున్నట్టు తెలిసింది.
మంత్రి కామినేని ఆగ్రహం
పసికందు అదృశ్యంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రక్షాళనలో భాగంగా ఇక ప్రతి ఆసుపత్రిలో కాన్పు అయిన వెంటనే ప్రతి శిశువుకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఆర్‌ఎఫ్‌ఐఎస్)తో చేతికి ట్యాగ్ వేసే పద్ధతిని ప్రారంభించనున్నట్టు చెప్పారు. దీని ద్వారా శిశువును తల్లికి ఎవరు దూరం చేసినా ట్యాగ్‌ను కత్తిరించిన వెంటనే బీప్ శబ్దాలతోపాటు పరిసరాల్లోని స్పెన్సర్లు కూడా గుర్తిస్తాయన్నారు. ఆసుపత్రిని సందర్శించిన వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ ఆసుపత్రుల్లో ప్రస్తుతం కొనసాగుతున్న సెక్యూరిటీ, శానిటేషన్ విభాగాల్లో మార్పులు తీసుకువస్తున్నామన్నారు. ప్రతి ఆసుపత్రికి సిసి కెమెరాలు ఏర్పాటుచేసి వాటిని నిర్వహించే విధంగా కాంట్రాక్టు వ్యవస్థను తీసుకువస్తామన్నారు. వీటిని స్థానిక పోలీస్ స్టేషన్లతో కూడా అనుసంధానిస్తామన్నారు.