ఆంధ్రప్రదేశ్‌

పవిత్రం.. పారవశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 13: అణువణువునా పోటెత్తిన భక్తజనుల పవిత్ర స్నానాలతో కృష్ణవేణమ్మ పరవశించిపోయింది. అన్ని స్నాన ఘట్టాల్లోనూ కిటకిటలాడిన జనం భక్తితో చేస్తున్న పూజలకు ఆమ్మ పులకించిపోయింది. తొలిరోజు వరలక్ష్మీవ్రతం కారణంగా వెలవెలపోయిన స్నాన ఘట్టాలు రెండోరోజున నిండుగా కనిపించటంతో కృష్ణాజలాలు మిలమిల మెరుస్తూ కేరింతలు కొట్టాయి. ఎక్కడ చూసినా సంరంభమే.. ఒకవైపు నవదుర్గా హారతుల వైభవం.. ఇంకోపక్క అద్భుత సాంస్కృతిక కార్యక్రమాల సంరంభాలు.. మరో పక్క పితృతర్పణాలు..్భక్తులు, ముఖ్య అతిథులు, పర్యాటకులు, సాధుసంతుల స్నానాచరణాలతో పుష్కరతీరం శోభాయమానంగా వెలిగిపోయింది. కృష్ణా పుష్కరాల రెండో రోజైన శనివారం విశేష సంఖ్యలో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. పుష్కరాల ప్రారంభం రోజైన శుక్రవారం శ్రావణ లక్ష్మి పూజలు ఉండడంతో భక్తులు పుష్కరాలకు హాజరు కాలేకపోయారు. శనివారం భక్తుల సంఖ్య రెట్టింపైంది. కృష్ణ, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కలిసి సుమారు ఆరు లక్షల మంది పుణ్య స్నానాలు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. శనివారం తెల్లవారుజామునే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఘాట్‌లలో స్నానాలు చేయడం ఆరంభించారు. విజయవాడ నగరంలోని పద్మావతి, కృష్ణవేణి, దుర్గా ఘాట్‌లలో అధిక సంఖ్యలో భక్తులు స్నానాలు చేశారు. పుష్కరాల తొలి రోజున భక్తులు ఘాట్‌ల వద్దకు రావడానికి పోలీసులు అనేక ఆంక్షలు విధించారు. దీంతో ఘాట్‌ల వద్ద జనం కనిపించలేదు. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లింది. వెంటనే ఆంక్షలను సరళతరం చేయాల్సిందిగా సిఎం చంద్రబాబు డిజిపిని ఆదేశించారు. హైదరాబాద్, విశాఖ నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సులను విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకూ అనుమతించారు. దీంతో భక్తులు బస్ స్టేషన్‌లో దిగి, అక్కడి నుంచి నేరుగా పుష్కర ఘాట్‌లకు చేరుకున్నారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఎవరికి నచ్చిన ఘాట్‌లలో వారు స్నానం చేసేందుకు వీలుగా తిరుమల నుంచి రప్పించిన మినీ బస్సులలో వారిని తరలించారు. అలాగే ద్విచక్ర వాహనాలను కూడా పుష్కర ఘాట్‌ల వరకూ అనుమతించడంతో భక్తులు సుళువుగా ఘాట్‌ల వద్దకు చేరుకోగలిగారు.
శనివారం పుష్కర స్నానాలకు మహిళలు అధిక సంఖ్యలో వచ్చారు. శనివారం కృష్ణ, గుంటూరు, కర్నూలు జిల్లాలో ఆరు లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణా జిల్లాలో మూడు లక్షల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. గుంటూరు జిల్లాలో లక్షన్నర మంది, కర్నూలు జిల్లాలో 81 వేల మంది భక్తులు స్నానాలు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఘాట్‌లను పరిశీలించిన మంత్రులు
పుష్కర ఘాట్‌లలో పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఆయనతో పాటు మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర విజయవాడలోని కృష్ణవేణి, పద్మావతి తదితర ఘాట్‌లను పరిశీలించారు. అలాగే మంత్రి సిద్దా రాఘవరావు నగరానికి చేరుకుని ఆర్టీసీ ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలను సమీక్షించారు. అలాగే హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరు జిల్లా అమరావతికి వెళ్లి అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
గుంటూరు జిల్లాలో ఇక గుంటూరు జిల్లాలోని సీతానగరం ఘాట్ వద్ద సుమారు 35 వేల మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారు. అమరావతిలో దాదాపు లక్ష మంది భక్తులు స్నానాలు చేసినట్టు అధికారులు చెప్పారు. గుంటూరు జిల్లాలో వేల మంది పిండ ప్రదానం చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అనేక స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఉచితంగా అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు.