తెలంగాణ

లక్ష కోట్లతో ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న తెలంగాణలో ముందనుకున్నట్టే అభివృద్ధి సాధిస్తున్నట్టు సిఎం కె చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల తరువాత బస్సు యాత్ర జరుపుతామని, సమావేశాల సమయంలోనే నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టనున్నట్టు ప్రకటించారు. తెలంగాణ ఏర్పడితే మన ఉద్యోగాలు, నిధులు, నీళ్లు మనకే వస్తాయని చెప్పాను. అదిప్పుడు రుజువవుతోందన్నారు. వచ్చే బడ్జెట్‌లో ప్రగతి పనులకే లక్షా పదివేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు గర్వంగా చెబుతున్నానన్నారు. రాజేంద్రనగర్ తెదేపా ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తెరాసలో చేరారు. ఈ సందర్భంగా మైలార్‌దేవ్‌పల్లిలో జరిగిన బహిరంగ సభలో సిఎం కెసిఆర్ మాట్లాడారు. నగరంలో ఇక విద్యుత్ కోతలు ఉండవని, ఎన్నికల్లో చెప్పినట్టే వెయ్యి రూపాయల ఫించన్ అందిస్తున్నట్టు చెప్పారు. ఒక్కో వ్యక్తికి ఆరుకిలోల చొప్పున బియ్యాన్ని అందిస్తున్నామన్నారు. మార్చి 31 నుంచి బీసీలకూ కళ్యాణలక్ష్మి అమలు చేస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాకు ఫించన్లకింద ఏడు కోట్లిస్తే, ఇప్పుడు 33 కోట్లు ఇస్తున్నామన్నారు. ఆంధ్ర నేతలు గీత కార్మికుల నోట్లో మట్టికొట్టారని, తాను చెప్పినట్టే అధికారంలోకి రాగానే కల్లు దుఖాణాలు తెరిపించామన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి సమిష్టి సాధనతో తెలంగాణ అభివృద్ధి సాధించాలన్న సంకల్పంతో ఇతర పార్టీలను కలుపుకొని పోతున్నట్టు చెప్పారు.
111 జీవోపై త్వరలో నిర్ణయం
హిమాయత్‌సాగర్ పరివాహక ప్రాంతంలో నిర్మాణాలకు సంబంధించి జీవో 111పై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు సిఎం తెలిపారు. కొత్త పాత తేడాలేకుండా తెలంగాణకు అందరూ కలిసి పనిచేయాలని కెసిఆర్ కోరారు. తెలంగాణలో ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలనేది లక్ష్యమన్నారు. బడ్జెట్ సమావేశాలు జరిగే సమయంలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపడతామన్నారు. బడ్జెట్ సమావేశాల తరువాత జిల్లాల్లో బస్సు యాత్ర జరిపి అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షిస్తారు.
కెసిఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యం
సిఎం కెసిఆర్‌తోనే బంగారు తెలంగాణ సాకారమవుతుందని తెరాసలో చేరిన ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. మిషన్ భగీరథ కింద రంగారెడ్డిలో రెండు వేల కోట్ల వ్యయంతో ప్రతి ఇంటికి మంచినీరు అందించనున్నట్టు మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆర్ అండ్ బి రోడ్లకు 1200 కోట్లు, పంచాయితీరాజ్ రోడ్లకు 470 కోట్లు, మిషన్ కాకతీయకు 280 కోట్లు కేటాయించిన ఘనత కెసిఆర్‌దే అన్నారు. ప్రకాశ్‌గౌడ్‌తోపాటు తెదేపా నేతలు పెద్దఎత్తున తెరాసలో చేరారు.

చిత్రం...

రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు
తెరాస కండువా కప్పుతున్న సిఎం కెసిఆర్