ఆంధ్రప్రదేశ్‌

అక్షరాస్యతలో అడుగున.. నిరుద్యోగంలో పైన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏపి సామాజిక, ఆర్థిక సర్వేలో వెల్లడి

హైదరాబాద్, మార్చి 10: ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత పరంగా చూస్తే దేశస్థాయిలో సగటు కంటే అట్టడుగున ఉందని సామాజిక సర్వే నివేదికలో పేర్కొంది. జాతీయ స్థాయి అక్షరాస్యత 72.98 శాతం కాగా, ఆంధ్రప్రదేశ్ సగటు 67.35 శాతం ఉంది. గరిష్ట అక్షరాస్యత పశ్చిమగోదావరిలో 74.32 శాతం కాగా, విజయనగరం జిల్లాలో అక్షరాస్యత 58.89 శాతం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 61.74 శాతం, విశాఖలో66.91 శాతం, తూర్పుగోదావరి 70.50, కృష్ణా 73.74 శాతం, గుంటూరు జిల్లా67.40, ప్రకాశం జిల్లా 63.08, నెల్లూరు జిల్లా 68.90 , కడప జిల్లాలో 67.30, కర్నూలు 59.97 శాతం, అనంతపురం 63.57, చిత్తూరు 71.53 శాతం అక్షరాస్యత నమోదైంది.
కాగా 13 జిల్లాల్లో 8,83,668 మంది ఇప్పటికే నిరుద్యోగులుగా నమోదయ్యారు. అఖిల భారత స్థాయిలో 2004-05 నాటికి ప్రతి వెయ్యి మందిలో గ్రామాల్లో ఏడుగురు, పట్టణాల్లో 36 మంది నిరుద్యోగులుగా ఉన్నారు. అదే జాతీయ స్థాయిలో గ్రామాల్లో 17 మంది, పట్టణాల్లో ప్రతి వెయ్యి మందిలో 45 మంది నిరుద్యోగులుగా ఉన్నారు. 2009-10 నాటికి ఆంధ్రాలో గ్రామాల్లో నిరుద్యోగులు ప్రతి వెయ్యి మందికి 12 మందికాగా, పట్టణాల్లో ప్రతి వెయ్యి మందికి 31 మంది ఉన్నారు. 2011-12 నాటికి గ్రామాల్లో ప్రతి వెయ్యి మందికి 12 మంది, పట్టణాల్లో ప్రతి వెయ్యి మందికి 43 మంది నిరుద్యోగులున్నారు. జాతీయ స్థాయిలో పట్టణాల్లో నిరుద్యోగులు ప్రతి వెయ్యి మందికి 45 నుండి 34కు తగ్గగా, ఆంధ్రాలో మాత్రం ప్రతి వెయ్యి మందికి 31 నుండి 43కు పెరిగింది.
19 సెజ్‌లలో రూ.14,399 కోట్ల పెట్టుబడులు,
62,895 మందికి ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్‌లో 19 ఆర్ధిక మండళ్లలో 14399.47 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, దీని వల్ల 62,895 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు సామాజిక ఆర్ధిక సర్వేలో వెల్లడైంది. ఈ సెజ్‌ల నుంచి రూ.3354.94 కోట్ల ఉత్పత్తులు జరిగాయి. ఏపిఐఐసి ఆధ్వర్యంలోని ఆరు సెజ్‌లలో 2693.14 కోట్లు, ఏపిఐఐసి జాయింట్ వెంచర్ల ఆధ్వర్యంలో మూడు సెజ్‌లలో రూ.2693.14 కోట్లు, ఏపిఐఐసి సహాయంతో వచ్చిన ఐదు సెజ్‌లలో రూ.5983.66 కోట్లు, ప్రైవేట్ డెవలెపర్ల ఆధ్వర్యంలో ఐదు సెజ్‌లలో రూ.3157.75కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో ఈ సెజ్‌లలో తాజాగా 3354.94 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు సర్వేలో పేర్కొన్నారు.
సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల విలువ రూ.2150 కోట్లు
ఐటి సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల విలువ 2014-15లో రూ.1850 కోట్లు ఉండగా, వర్తమాన ఆర్థిక సంవత్సరంలో నవంబర్ వరకు రూ.2150 కోట్ల ఎగుమతులు చేసినట్లు సామాజిక ఆర్ధిక సర్వేలో పేర్కొన్నారు. మొత్తం ఐటి కంపెనీలు 356 ఉన్నాయని, ఈ ప్రగతి కింద 33 శాఖలు ఉన్నాయని పేర్కొన్నారు. స్టార్టప్‌ల సంఖ్య 156కు, ఐటి ఇంక్యుబేషన్ టవర్లు మూడు ఉన్నాయి. ఉద్యోగావకాశాలను విశే్లషిస్తే వర్తమాన సంవత్సరంలో 7200 మందికి ఉద్యోగాల కల్పన జరిగింది.