రాష్ట్రీయం

జగన్ క్షమాపణ చెప్పాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పట్టుబట్టిన పాలక పాక్షం
అవిశ్వాసం ఆద్యంతం..ఉద్రేకం
న్యాయ వ్యవస్థను బాబు మేనేజ్ చేసుకున్నారు: జగన్
జగన్ వ్యాఖ్యలు అసెంబ్లీకే మచ్చ: చంద్రబాబు
కొవ్వు ఎక్కి మాట్లాడారు: అచ్చెన్నాయుడు
స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన వైకాపా
రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్

హైదరాబాద్, మార్చి 14: రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చ ఆద్యంతం ఉద్రేకంగా సాగింది. వైకాపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై పాలక పక్షం సభ్యులు వాటిని నిరూపించాలంటూ పట్టుబట్టారు. వివిధ కేసుల్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసుకున్నారని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. జగన్ క్షమాపణ చెప్పాలని పాలకపక్షం పట్టుబట్టింది. ఈ దశలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జగన్‌కు కొవ్వు ఎక్కువైందని అనడంతో మరింత ఆజ్యం పోసినట్లయ్యింది. వైకాపా ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి అచ్చెన్నాయుడును సభ నుంచి సస్పెండ్ చేయాలని పట్టుబట్టారు. దీంతో అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. స్పీకర్ కూడా ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.
శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఆరోపణలు చేసిన జగన్ వాటిని నిరూపించాలని డిమాండ్ చేశారు. బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహా ప్రతి ఒక్కరూ ఆధారాలు చూపించాలని అన్నా జగన్ చూపించడం లేదని అన్నారు. వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్ రెడ్డి మాట్లాడుతూ జగన్ చేసిన ఆరోపణలపై సిబిఐ విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతున్నదని ప్రశ్నించారు. మంత్రి యనమల మాట్లాడుతూ పార్లమెంటరీ రూల్స్ ప్రకారం వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా విమర్శలు చేయరాదని అన్నారు. టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ ఆరోపణలు చేసిన జగన్ ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ కోడెల మాట్లాడుతూ సిబిఐ విచారణ చేపడితే పెట్టుబడిదారులకు లేనిపోని అనుమానాలు కలుగుతాయని, తద్వారా పెట్టుబడులు రావని అన్నారు. జగన్ మాట్లాడుతూ తాను కేసులు ఎదుర్కొంటున్నది వాస్తవమే అయినా దోషిగా ప్రకటించలేదని అన్నారు. ఆ కేసుల గురించి సభలో మాట్లాడితే సబ్-జ్యుడీస్ అవుతుందని అన్నారు. చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి తనపై కేసులు పెట్టాయని ఆయన విమర్శించారు. ఆడియో-వీడియో టేపుల్లో చంద్రబాబు దొరికిపోయారని, రెండు ఎకరాల ఆసామి ఇన్ని కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ఈ దశలో పాలక పక్ష సభ్యులు జగన్ ప్రసంగానికి తీవ్ర ఆటంకం కలిగించారు.
అందరికీ బురద అంటించాలని: బాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఆరోపణలతో వ్యక్తిగత పోరాటంగా చేయరాదని అన్నారు. జెన్‌కో కోసం కొత్తగా బొగ్గు ఖరీదు చేశామని చెప్పారు. రైతులు బాగుపడితే మీరు భరించలేరని అన్నారు. లోగడ జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం చేశారని ఆయన విమర్శించారు. బురదలో ఉన్న జగన్ అందరికీ బురద అంటించాలనుకుంటున్నారని అన్నారు. తనపై ఎన్నో కేసులు వేశారని, చివరకు సుప్రీంకోర్టు వెళితే డిస్మిస్ అయ్యాయని తెలిపారు. సొంత పత్రికను అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, తనపై ఎన్నో విచారణలు చేపట్టారని, చివరకు కోర్టులో విధిలేక కేసు ఉపసంహరించుకున్నారని తెలిపారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం కోర్టులను వాడుకోరాదని అన్నారు. ఇడి కేసులను ఎదుర్కొంటున్న వ్యక్తి తనపై ఆరోపణలు చేస్తున్నారని, రాష్ట్రం అభివృద్ధి కారాదనే దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారని విమర్శించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే శిక్షించాలని ఆయన స్పీకర్‌ను కోరారు.రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నందుకా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని ఆయన ప్రశ్నించారు. రౌడీయిజం చేసే వారికి, దబాయించే వారికి మైకు ఇస్తారా? మేమూ దౌర్జన్యం చేయాలా? అని ఆయన స్పీకర్‌ను ప్రశ్నించారు. యనమల మాట్లాడుతూ జగన్ అసెంబ్లీకే కాదు న్యాయమూర్తులకూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగినా, పాలకప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగినా జగన్ మాత్రం తాను న్యాయ వ్యవస్థను కించపరచలేదని, గౌరవించే వారిలో మొదటి వ్యక్తినని అన్నారు.