సబ్ ఫీచర్

అపూర్వ యాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయుత చండీయాగం ఒక అపూర్వమైన యోగం. తెలంగాణ రాష్ట్రానికే కాదు తెలుగు ప్రజలందరికీ కీర్తి ప్రతిష్ఠలను, దైవానుగ్రహాన్ని కలిగించే సుయోగం. ‘‘అగ్నిముఖావై దేవాః’’ అన్నది వేదవాక్యం. ‘‘అగ్ని మీళే పురోహితం’’ అనేది ప్రథమ వేదమైన ఋగ్వేదంలోని ప్రథమ మంత్రం. ‘‘హిరణ్య వర్ణాం హరిణీ...అనే శ్రీసూక్తం ప్రపథమంగా ప్రార్థించేది అగ్నినే- ఓ అగ్నిదేవా..ఐశ్వర్య స్వరూపిణి అయిన లక్ష్మీదేవి మమ్మల్ని ఆవహించేలా చేయి..అంటుందీ మంత్రం. అగ్నికి హవ్యవాహనుడు అని పేరు. తేజో రూపులైన దేవతలకు తేజోరూపుడైన అగ్నిద్వారానే హవిర్భాగం అందుతుంది- అందుకే ప్రతి పూజకూ ముందు ‘ఆదౌ దీపారాధనం కృత్వా’ అంటూ ప్రారంభవౌతుంది- ‘‘ఆకాశాత్ వాయుః-వాయోరగ్నిః అగ్నేరాపః’’ అని అగ్ని వలననే నీరు ఉత్పన్నమైనదని సృష్టి రహస్యాన్ని చెబుతుంది వేదం. భగవద్గీతలో కూడా ‘‘యజ్ఞాత్ పర్జన్యః’’ అన్నాడు భగవానుడు- యజ్ఞము-యాగము-క్రతువు-అధ్వరము- ఇవన్నీ పర్యాయ పదాలే.
‘‘యజ్ఞోవై విష్ణుః’’ అని యజ్ఞమును విష్ణువుగా కీర్తిస్తుంది వేదం- ‘‘దేవేభ్యోయజ్ఞః దేవయజ్ఞః-పితృభ్యో యజ్ఞః పితృయజ్ఞః భూతేభ్యో యజ్ఞః, భూత యజ్ఞః అని యజ్ఞమూ మూడు రకాలుగా చెప్పారు. యజ్ఞము- యాగమూ- రెండూ ఒకటే అయినా, పరిమితి రూపంలో చేసినపుడు యజ్ఞంగాను,విస్తృత రూపంలో చేసినప్పుడు యాగంగాను పిలవడం జరుగుతుంది. ఔషదీ పదార్ధాలు, పవిత్రమై గోఘృతం-అంటే ఆవునెయ్యి ఆజ్యం-అంటే మేకపాలతో పొంది నెయ్యి ఔషధీ వృక్షాలైన మోదుగు- మారేడు-మేడి-రావి-జువ్వి-మఱ్ఱి వంటి చెట్ల సమిధలు-ఇంకా మరెన్నో హోమ ద్రవ్యాలు ఉపయోగించి చేసే యజ్ఞంలోని హోమ ధూమం పర్యావరణానికి మేలు చేస్తుంది. లౌకిక, పారమార్థిక ప్రయోజనాలను, కామ్యక ఫలాలను అందించే యాగ వైదిక కర్మ మహోత్కృష్టమైన విధానం- యజ్ఞంలో పవిత్ర మంత్ర పఠన శబ్ద తరంగాలు ఆధ్యాత్మిక తరంగాలను ప్రసరింపజేస్తుంది.
‘‘కలౌచండీవినాయకా’’ అన్నది పండితవాక్యం. కలి దోషాలను హరించడంలో చండీ వినాయకులు ప్రధాన దేవతలు- అటువంటి మహాచండీ యాగాన్ని అయుత రీతిలో, అత్యంత భక్తి శ్రద్ధలతో, సంపూర్ణ శాస్త్ర విశ్వాసంతో, ధన వ్యయాన్ని లెక్కచేయని త్యాగంతో, మాన్యశ్రీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్వహించడం అభినందనీయం మాత్రమేకాదు, అందరికీ ఆదర్శనీయం కూడా. సంక్షిప్తంగా కె.సి.ఆర్‌గా పిలుబడే ఆయన అపజయమెరుగని ఉద్యమకారుడు-పరిపాలనలో దక్షుడైన ముఖ్యమంత్రి. స్నేహితులకు మాత్రం మంచి స్నేహితుడు. విశ్వసనీయులకు మంచి విశ్వాసపాత్రుడు. సమర్ధులైన సంతానానికి మంచి తండ్రి. ఆయనకూ, ఆయన సతీమణికి, ఆయన కుటుంబానికి మహాచండీ పరమేశ్వరి సంపూర్ణానుగ్రహం లభిస్తుంది. ఇది సమస్త ఆస్తిక ప్రజల ఆశంస-ప్రశంస-‘‘జయతు చండీ పరమేశ్వరీ.’’

- ఉమాపతి బి. శర్మ