యువ

యాప్స్ పని ఇక సరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పావులు కదుపుతున్న గూగుల్ * సెర్చ్ ఇంజన్‌లోనే ఇక యాప్స్ సమాచారం
గూగుల్ సెర్చ్ ఇంజన్!
దీన్ని ఓపెన్ చేస్తే అరచేతిలో అంజనం వేసినట్టే. ప్రపంచంలో ఏం కావాలన్నా మాయల ఫకీరుముందున్న అద్దంలా అన్నీ చూపించేస్తుంది. సకల సమాచారమూ మీ ముందు ఆవిష్కరించేస్తుంది. గత రెండు దశాబ్దాలుగా గూగుల్ సెర్చ్ ఇంజన్ మానవ జీవితంతో ఇంతగా మమేకమైపోయింది. కంప్యూటర్‌ను ఎంత అనాయాసంగా ఆన్ చేస్తామో, అంతే అలవోకగా గూగుల్ సెర్చ్ ఇంజన్‌లోకి వెళ్లిపోవడమూ మనకు అలవాటైపోయింది. ఆ మాటకొస్తే, ఈ సెర్చ్ ఇంజన్ వచ్చాక, మనిషి ఏమీ గుర్తు పెట్టుకోవట్లేదు. అవసరమైతే, గూగుల్‌లోకి వెళ్లి జవాబు వెతుక్కుంటున్నాడంతే.
అయితే కాలం మారింది. కాలంతోపాటు టెక్నాలజీ కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. స్మార్ట్ఫోన్లు వచ్చాక కంప్యూటర్‌తో పని తగ్గింది. అలాగే గూగుల్ సెర్చ్ ఇంజన్‌తోనూ పని తగ్గింది. ఇది యాప్స్ యుగం. ఏం కావాలన్నా యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం, సెర్చ్ చేసుకోవడం. ఉదాహరణకు ఏదైనా హోటల్ గురించి వెదకాలనుకోండి...హోటల్ టునైట్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే సరి. లేదా బూట్ల గురించి వెతకాలా? జప్పోస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇవేనా...ఇన్‌ఫర్మేషన్ యాప్స్ కూడా బోలెడు. దీంతో గూగుల్ సెర్చ్ ఇంజన్‌కు తాకిడి తగ్గింది. ఒకవిధంగా స్మార్ట్ఫోన్లు వచ్చాక ఈ బెడద మరీ ఎక్కువైందన్న విషయాన్ని స్వయంగా గూగుల్ గమనించింది. దీనికి విరుగుడు కనిపెట్టే పనికి నడుం బిగించింది. ఆ ప్రయత్నంలో దాదాపు సక్సెస్ అయింది కూడా. ఎలాగంటారా? మీకు ఏం కావాలన్నా యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోకుండానే ఆ యాప్ అందిచే సమాచారం పొందే వినూత్న టెక్నాలజీకి గూగుల్ శ్రీకారం చుట్టింది. ఉదాహరణకు ఓ హోటల్ గురించి మీరు వెదకాలనుకున్నారనుకోండి... గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో ఆ సమాచారం కోసం మీరు ప్రయత్నం ప్రారంభించిన వెంటనే...వెబ్ సమాచారంతోపాటు సంబంధిత యాప్స్‌లో ఉన్న సమాచారాన్ని కూడా సదరు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోకుండానే అందిస్తుంది. మీరో బటన్ నొక్కగానే, ఆ యాప్‌ను గూగుల్ ఓపెన్ చేసి మీకందిస్తుంది. దీనికోసం మీరు ప్రత్యేకంగా ఆ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోనక్కర్లేదు. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకునేందుకు, దానిని ఓపెన్ చేసేందుకు ఎక్కువ సమయం పట్టడం సాధారణంగా మనందరికీ అనుభవైకవేద్యమే. పైగా మీ డివైస్‌లో యాప్స్ ఎక్కువ స్పేస్‌ను ఆక్యుపై చేస్తుంటాయి. ఇకపై అలాంటి బాధలు తప్పినట్టే. పనిలోపనిగా స్మార్ట్ఫోన్లలో గూగుల్ సెర్చ్ ఇంజన్ వాడకం పెరుగుతుంది. అయితే ప్రస్తుతానికి గూగుల్...ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగించే ఫోన్లలోనే ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. అలాగే హోటల్ టునైట్, వెదర్, న్యూయార్క్ సబ్‌వే, మై హారోస్కోప్, డైలీ హారోస్కోప్, విజువల్ అనాటమీ ఫ్రీ, యూజ్‌ఫుల్ నాట్స్, గోర్మీ, చిమానీ వంటి తొమ్మిది యాప్స్ సమాచారాన్ని మాత్రమే ఇలా అందిస్తోంది. రానున్న కాలంలో ఈ పరిధిని మరింత విస్తృతం చేస్తామని గూగుల్ మొబైల్ సెర్చ్, యాప్ ఇండెక్సింగ్ టీమ్ ఇంజనీర్ రాజన్ పటేల్ అంటున్నారు.
*