కృష్ణ

జిల్లాలో ప్రశాంతంగా ఎపిపిఎస్‌సి పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 23: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ గ్రూప్-3 పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకై ఆదివారం జిల్లాలో నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 40వేల 877 మంది అభ్యర్థులకు 24వేల 123 మంది హాజరయ్యారు. 16వేల 754 మంది గైర్హాజరయ్యారు. ఉత్తీర్ణతా శాతం 59.01గా నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 82 కేంద్రాలలో పరీక్ష నిర్వహించారు. 37 మంది లైజన్ అధికారులు, 82 మంది అసిస్టెంట్ లైజన్ అధికారులు, ఎనిమిది మంది అడిషనల్ కో-ఆర్డినేటింగ్ అధికారులు పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్ష ముగిసిన తర్వాత ఓఎమ్‌ఆర్ షీట్లను పోలీసు బందోబస్తుతో తరలించారు. ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహణకు కృషి చేసిన జిల్లా అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ బాలయ్య నాయుడు లక్ష్మీకాంతం అభినందించారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఐదు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 2వేల 560 మంది అభ్యర్థులకు గాను 1245 మంది హాజరయ్యారు. రెవెన్యూ డివిజనల్ అధికారి పి సాయిబాబు, తహశీల్దార్ నారదముని పరీక్షా కేంద్రాలను సందర్శించారు.