పర్యాటకం

సమ సమాజ దర్పణం మన అయోధ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త మ్ముడు లేకుండా నేనుండలేననే అన్న, అన్న పాదుకలే నా ఇలవేల్పు అనే తమ్ముడు, తండ్రి మాటే వేదం అనే కొడు కు, రాజ్యమే మిన్న రాజుకన్నా అనే భార్య, ఇలా చిత్రవిచిత్రమైన మానవ సమాజమంతా ఇక్కడే కుప్పపోసిందా అన్నట్టుగా ఉన్న రాజ్య మే అయోధ్యా రాజ్యం. త్రేతా యుగం లోనిది అయనా నేటికీ అయోధ్య పేరు చెప్తేనే చాలు ఒళ్లు పులకరించి పోతుంది. ఆ అయో ధ్యలోని గాలి, నీరు, మన్ను ఏవి అయన పవిత్రాలుగా భావించే భారతీ యులకు అయోధ్య ఓ సుందరనగరం. ఆధ్యాత్మికం గానే కాదు చారిత్రకంగాను ఎంతో ప్రసిద్ధి చెందిన అయోధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫైజాబాద్‌కు ఆరు కిలోమీటర్లు దూరంలో ఉంది. ఈ అయోధ్య విస్తీర్ణంలో చిన్నదైనప్పటికీ, మహిమరీత్యా ప్రఖ్యాతి చెందినదని సప్తమోక్ష పురాలలో ఒకటని మన పురాణాలు చెబుతున్నాయ. అయోధ్య ‘పూర్వనామం’ సాకేత. కోసల దేశ రాజధానిగా ప్రసిద్ధిగాంచిందీ నగరమే. ఈ అయోధ్యను ఇక్ష్వాకువంశం వారు పాలకులుగా ప్రపంచ ప్రసిద్ధు లైనారు. నేడు రాముడన్నా రామరాజ్యం అన్నా మక్కువ చూపే ప్రజల మనోభి రాముడు అక్కడే జన్మించాడు. ఇక్ష్వాకుల వంశంలోని ఓ రాజైన ‘అయుధ’ ఈ క్షేత్రాన్ని పాలించినందు వల్ల ఆయన తదనంతర కాలంలో ఈ క్షేత్రానికి అయోధ్య అనే పేరు వచ్చినట్లు స్థానికులుచెబుతారు. ‘యుధ్’ అంటే సంస్కృతంలో యుద్ధమని, నాశనమని అర్థం. అ ‘యుధ్’ అంటే నాశనం కానిదని అర్థం కనుక ఎప్పటికీ నాశం కానిది అయోధ్య. పురాణ పురుషుడు, ధర్మ మూర్తి అయన శ్రీరామచంద్రుడికి జన్మనిచ్చిన పుణ్యప్రదేశంగా ఖ్యాతికెక్కిన ‘అయోధ్య’ గాగ్రా నది ఒడ్డున ఉంది. సర యూ నదిగా పేరుప్రఖ్యాతులు పొందిన ఈ నదిలోనే శ్రీరాముడు, అవతార సమాప్తిని చాలించాడని స్కంద పురాణంవల్ల మన కు తెలుస్తుంది. శ్రీరామ నామస్మరణతో విలసిల్లే ఈ అయోధ్య విశాలమైన అందమైన ఆలయాలకు వేదిక. ఈ క్షేత్రంలో వందకు పైగా ఆలయాలున్నట్టు తెలు స్తుంది. తనకుపుత్రసంతానం లేదని ఎన్నో ఏళ్ళుగా వాపోయన దశరథుడు యజ్ఞ్ఫలంగా శ్రీరామా దులను తనయులుగా పొందాడు. ఈ అయోధ్యను వనవాసం చేసివచ్చిన తరువాత దాదాపుగా 11వేల ఏండ్లు రాముడు రాజ్యపాలన చేసినట్టు చెబుతారు. జైన తీర్థంకరులలో ముఖ్యులైన ఐదుగురి తీర్థంకరుల ఇక్కడే పుట్టారట. అన్నదమ్ముల అనురాగానికి, మిత్రులతో సఖ్యానికి, భార్యాభర్తల అనుబంధానికి, తల్లిబిడ్డల సహృదయ తకు ఇలా ఎన్నింటికో ఆదర్శంగా నిలిచిన శ్రీరాము ని పాదస్పర్శతో పులకించిన ఈ నగరాన్ని సంద ర్శించటం భారతీయులకే కాదు ప్రపంచం లోని ఏమానవులకైనా మధురానుభూతిని కల్గిస్తుం ది అని అంటారు. పురాణాలే కాదు అధర్వణ వేదం కూడా దేవతలు ఈనగరాన్ని నిర్మించినందున ఇది మోక్షధ్యానపురిగాను భూతలంలో స్వర్గంగాను భాసిల్లుతుందని చెబుతోంది.
తైర్థికలందరూ ముందుగా ఇక్కడ సరయు నదిలో స్నానపానాదులు నిర్వర్తిస్తారు. తమ పూర్వీకులకు పిండప్రదానాలు చేస్తారు. ఆతరువాత ఇక్కడ నెలకొన్న ఆలయాలను దర్శిస్తారు. దేశదేశే కళాత్రాణి... ఏ దేశాలకు వెళ్లినా భార్యను పొందవచ్చు; మరేమైనా పొందవచ్చు; కానీ అనుజుణ్ణి (అనుజన్ముణ్ణి) పొందలేమనే శ్రీరాముని చేత మూర్థాన్ని ఆఘ్రాణింపచేసుకొనే అపూర్వ అభిమానాన్ని పొందిన రామానుజుణ్ణి తనవితీరా చూసేందుకు తరతరాలకు అన్నదమ్ముల మైత్రికి చిరునామాగా నిలిచే లక్ష్మణస్వామిని చిహ్నంగా చూపడానికి సరయు నదిప్రక్కనే లక్ష్మన్నకోసం గుడిని నిర్మించారు.
ఈ లక్ష్మణస్వామిని చూచి ఆనాడు నికుంబిలా హోమాన్ని నిరోధింపచేసి ఇంద్రజిత్తును మట్టికరిపించినదీ స్వామినే కదా అన్న సంఘటన సందర్శకులకు స్ఫురణకు తెప్పిస్తుందంటారు సందర్శకులు. దీని సమీపంలోనే నాగేశ్వరనాథ్ మందిరం ఉంది. దీనిని శ్రీరాముని కుమారుడు ‘కుశుడు’ నిర్మించినట్టుగా తెలుస్తోంది.
నాగేశ్వరనాధ్ మందిరానికి సమీపంలో కాలేరామ్ మందిరం ఉంది. ఈ మందిరంలో సరయూ నదిలో దొరికిన నల్లని సీతాలక్ష్మణ సహిత శ్రీరామచంద్రుని విగ్రహాలు ప్రతిష్టించారు. మతాలకు అతీతంగా ప్రేమతత్వాన్ని ఉద్భోంచిన శ్రీరాముని భావితరాలకు గుర్తుంచుకోవాలని నవాబు షాజుద్దౌలా శ్రీరామచంద్రుని ఆలయాన్ని నిర్మించారు.ఈ ఆలయంలో అంజనీమాత ఒడిలో బాల ఆంజనేయుని మూర్తి దర్శనం ఆశ్చర్యానుభూతులను కలుగచేస్తుంది. దీనికి సమీపంలో ‘కనక భవన్’ ఉంది.ఇందులోనూ సీతారామలక్ష్మణ విగ్రహాలు కనువిందుచేస్తాయ. కైకేయి మాత సీతామహాసాధ్వికి బహుమతిగా ఇచ్చిన పుణ్యస్థలమే ‘కనక భవన్’, అని కొందరు అంటారు. నిత్యమూ శ్రీరాముని నామోచ్చారణ ఇక్కడ ప్రత్యేకత.
అయోధ్య నగరంలోనే మరోచోట చోటిదేవ్‌కాళీ మందిరం ఉంది. వీటితోపాటు శ్రీరామ జానకి బిర్లా ఆలయం, తులసి స్మారక భవన్, రామ్‌కిపౌరి, దతువన్‌కుండ్, జానకి మహల్, బ్రహ్మకుండ్, లక్ష్మణ్‌కిలా, రామ్‌కధా మ్యూజియం,సుందర సదన్, హరిహర మందిరం, తులసీదాసు మందిరం, క్షీరేశ్వరుని మందిరాలున్నాయి. ఇట్లాంటి ఆలయాలు ఎన్నో అయోధ్యలోఉన్నాయ.

- హనుమాయమ్మ