మెయిన్ ఫీచర్

దత్తోహం దత్తోహం దత్త స్మరణం... పాపహరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిమూర్తులకు మించిన శక్తిఅంటే కేవలం గురుశక్తి మాత్రమే. గురువుగారి అనుగ్రహం సంపాదించినవారికి ఈ లోకంలోనే కాదు పరలోకంలోను ఎదురువుండదు. విశ్వామిత్రుని అనుగ్రహం సంపాదించిన త్రిశంకువు ప్రత్యేక స్వర్గానే్న నిర్మించుకొన్నాడు. అటువంటి గురుస్వరూపమే అసూయలేని అనసూయమ్మకు అత్రి మహర్షికు కుమారుడుగా జన్మించాడు. నారదుని ద్వారా అనసూయా మాత గొప్పతనాన్ని విని ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి వచ్చిన ముగ్గురమ్మలు తమ పతులను గుర్తించకలేక అనసూయమ్మకు తమ తమ పెనిమిటి ద్వారా వరాలనిప్పించి వారు స్వస్థలానికి వెళ్లిపోయారు. ఆ వరప్రభావమే అత్రి అనసూయల ముద్దుల కుమారుడుగా అఖిల లోకాలను ఉద్ధరించడానికి జ్ఞానమే స్వరూపంగా మూర్త్భీవించిన రూపమే అత్రివరదుడు, అనసూయమాత కుమారుడు.
ఆ కుమారుణ్ణి చూచి అత్రి ఆశ్రమమంతా ఆనందమనస్కులయ్యారు. అక్కడున్న సిద్ధపురుషులంతా ఆనందోత్సహాంతో చేతులెత్తి నమస్కరించబోయి తిరిగి అచేతనావస్థలోకి జారి అలా కళ్లప్పగించి చూస్తుండిపోయారా బాలచంద్రుడిని చూచి. మునిజనానే్న కాదు ఆశ్రమంలో ఉన్న స్ర్తిజనమంతా సంతోషాబ్ధిలో మునిగి చేతులుడిగి నిలిచారు. కన్నతల్లి అయిన అనసూయా మాత వైభవాన్ని ఆమె ఆనందాన్ని కొలువ కొలమానాలే లేకపోయాయి. ఆ తల్లి చిట్టి నా తండ్రీ నను పాలింప నడిచి వచ్చితివా స్వామీ నా తండ్రీ నన్ను కన్న నా తండ్రీ దత్తా దత్తా అంటూ పారవశ్యంలో మునిగిపోయింది. ఆ దత్తుని చూచిన పరవశత్వంలో అత్రిసైతం నిత్యానుష్ఠాలనే మరిచి బాలదత్తుని సేవలో మునిగాడు.
నారాయణుణ్ణే మెప్పించి వరాలందుకొన్న అత్రిఅనసూయ ఆనందకడలి పొంగి పొరులుతుంటే దినదినాభివృద్ధి పొందుతున్న బాల దత్తునితో ఆశ్రమవాసులు రోజొక్క అనుభవాన్ని రుచి చూడడం ఆరంభించారు. ఒక శిష్యుడు వచ్చి అమ్మా అమ్మా బాలదత్తుడు నన్ను నెత్తిన మొట్టితే నాకు సహస్రారం విచ్చుకుందమ్మా అంటే మరొకడు వచ్చి అమ్మా అమ్మా బాల దత్తునిచేతితో ఒక్క ముద్ద అన్నాన్ని తిన్నానమ్మా అంతే నాకు ఆకలి అనేదే తెలియదమ్మ అంటే ఇంకొక శిష్యుడువచ్చి అమ్మా అమ్మా నిన్నటిదాకా లేని అయోగ్యుడని, అభాగ్యుడని, మందుడని తిట్లు తిన్న నేను నేటి దినాన గురువుగారి అపార వాత్సల్యానికి పాత్రుడన య్యానమ్మా ఇదంతా ఆబాల దత్తుని చేతిముద్దలోని మహిమనే అమ్మా మూగవాడినని అందరూ గేలి చేసే నన్ను ఇలా రా అని పిలిచి ఏది నోరు తెరువు అన్నాడమ్మా ఈ బాలదత్తు అంతేనేను నోరు తెరిచారు చిన్నపుల్లతో నా జిహ్వాగ్రహం పై ఏదో చేశాడమ్మా అంతే నేను నా మాటలను దాచుకోలేక పోతున్నానమ్మా నప్పటి నుంచి అంటూ చెప్పే కబుర్లనన్నింటిని వినే అనసూయ నాడు శ్రీకృష్ణుడు దేవకీ దేవి కుమారుడై పుట్టినా యశోదమ్మ ఒడిలో పెరుగుతూ శ్రీకృష్ణుని బాల్య చేష్ఠలను తలుచుకుని తన్మయత్వం చెందేది.
నాడు యశోదమ్మ సైతం బాలకృష్ణుని గోపికలు చెప్పే అల్లరి పనులను విని నాలాగే మురిసేదేమో అనుకొంది. నాడు బాల కృష్ణుని ఆగడాలను విని ఆ యశోదమ్మ రోలు కట్టనెంచితే ఆ తల్లికి 14 భువనభాండాగారాలను చూపిన ఆ శ్రీకృష్ణుడే నేడు నాముద్దుల గారాల పట్టి అయనాడు కదమ్మా అనుకొంది.
బాలదత్తుని ఒకపరి పరికిద్దామని చూచి చూడగానే తాళపత్రాలపై లిఖిస్తూన్న చిన్నారి బాలదత్తుని చూచి రామరామ ఏమిరా మీ నాన్న గారి తాళపత్రాలను నీవు ఏమి చేస్తున్నావు అంటే అమ్మా అందరి నుదుటిరాతలను నేనే కదా బాగు చేయాల్సింది అందుకే వీటిని సరిదిద్దుతున్నాని చెప్పే గడుగ్గాయని చూచినోరు తెరిచిందా అమాయక అనసూయ. శిష్యగణానికి వేదాన్ని బోధించిన అలసి వచ్చే అత్రికి ఒళ్లంతా బూడిదపూసుకొంటూ తిరిగే దత్తుడు కనిపించాడు. అయ్యెయ్యో ఎంత పని జరిగింది. పిల్లవాడు యజ్ఞవేదికలోని బూడిద నంతా పూసుకొంటుంటే ఏమి చేస్తున్నావు అని అనసూయను దండించేబోయే అత్రి ఆపి నేను ఎల్లప్పుడు సదా వేడి వేడి బూడిదనే కదా పూసుకొనేది ఇందులో అమ్మ ఏం చేస్తుంది మీ శిష్యగణానికి ఆకలితీర్చే పనిలో ఉంటుందా లేక ననే్న చూస్తూ నా బూడిదను పూసుకు తిరుగు తుందా దీనికి మీకెందుకింత కంగారు అనే ఆ శివస్వరూపాన్ని చూచి నోరువెళ్లబెట్టాడా త్రికాలవేత్త అత్రి మహర్షి.
అట్లాంటి ఆ బాలదత్తుడే యోగి రాజపుంగవుడుగాను, జ్ఞానసాగరుడుగాను, విశ్వంభరావధూతగాను వెలుగొందాడు. ఆ దత్తస్వామినే పదహారుఅవతారాల్లో దర్శనమిస్తూ తన భక్తులను నిత్యం కాపాడుతుంటాడు. యోగిరాజు, అత్రివరదుడు,శ్రీ దత్తాత్రేయుడు, కాలాగ్నిశమనుడు, యోగి జన వల్లభుడు, శ్రీలీలా విశ్వంభరుడు, సిద్ధరాజు, జ్ఞాన సాగరుడు, విశ్వంభరావధూత, మాయా యుకాతవధూత, మాయాముక్తావధూత, ఆదిగురువు, శివస్వరూపుడు, శ్రీదేవదేవం, దిగంబరుడు, శ్రీకృష్ణ శ్యామల కమల నయనుడు అనే ఈ పదహారు నామాలను నిత్యం స్మరించుకొనేవారికి దత్తస్వామి సదా సరంక్షుడై ఉంటాడని దత్త భక్తుల ప్రగాఢనమ్మకం.
కలియుగంలో కలిదోషనివారణకు కలిమాయ నుంచి దూరం కావడానికి కూడా ఈ దత్తస్వామి స్మరణే తరుణోపాయం. ఈ దత్తస్వామి చరిత్రనే గురు చరిత్రగా పారాయణం చేసేవారున్నారు. దత్తస్వామిని కొలిచిన వారికి అఖండైశ్వర్యాలతో పాటు ముక్తి కూడా లభిస్తుంది.
అజ్ఞానమనే చీకటిలో తాడును పాముగా భ్రమించినట్లుగా క్షణభంగురమైన జీవితమే శ్వాశతమని అనుకొనేవారికి నిజస్థితి తెల్పి వారిలో జ్ఞానజ్యోతిని వెలిగించే స్వరూపమే శ్రీ దత్తస్వామి స్వరూపం.
అందుకే -
వరదః కార్తవీర్యాది రా రాజ్య ప్రదోనఘః
విశ్వశ్లాక్షైై్యమితాచారో దత్తాత్రేయో మునీశ్వరః
- అంటూ దత్తస్వామిని ప్రార్థిస్తే చాలు దత్తగురుస్వామిఅనుగ్రహం లభిస్తుంది.

- ఎన్. లక్ష్మి