పర్యాటకం

అక్షయ సంపదలకు తరుణమిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షయం అంటే తరగనిది అని, ఎప్పుడూ సమృద్దిగా ఉండేది అనే అర్థాలున్నాయి. పూర్వకాలంలో అక్షయ తృతీయ రోజున ఒక వైశ్యుడు యవలు, గోధుమలు, శనగలు, నీళ్ళతో కూడిన కుండలను బ్రాహ్మణులకు దానం చేశాడు. మరు జన్మలో అతడు క్షత్రియునిగా పుట్టి అనేక రెట్ల అధిక సంపదలకు యజమాని అయ్యాడు. పూర్వ జన్మలో చేసిన దానం వల్లనే నేనీ జన్మలో లక్షలకు అధికారిని అయ్యానని ఈజన్మలోనూ పుణ్యకార్యా లు చేయడం మొదలుపెట్టాడా క్షత్రియుడు. ఇక అప్పటి నుంచి మన పెద్దలందరూ ఇతరులకు ఉపయోగించేదేదైనా దానం చేస్తే మంచి పుణ్యం వస్తుందని అంటారు. ముఖ్యంగా ఈ మాసంలో చల్లటి నీరు నిండిన కుండలు, చందనం, గొడుగు, నారికేళాలు, మామిడిరసాలు, వెండిబంగారాలు, చందనం లాంటివి దానం చేస్తుంటారు.
వైకుంఠ నాథునికిఇష్టమైన మాసం కనుక ఈ మాసంలో ఏది దానం చేసినా విశేషమైన పుణ్యరాశి సొంతమవుతుంది. మహావిష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఈలోకంలోనే కాకపరలోకం లోను విశేషసంపద అంటే విష్ణుసాయుజ్యం లభిస్తుంది జ్ఞానులంటారు. వైశాఖ తృతీయనాడే కృతయుగం ఆరంభ మైందని ఆ కృతయుగాదనీ కొందరు అంటారు. ఈవైశాఖ తృతీయనాడు సింహాచలంలో అప్పన్నకు వైశాఖ విదియనాడు చందరోత్తరణసేవ చేసి తృతీయనాడు అరవై రకాల వనమూలికలను, సుగంధ ద్రవ్యాలను కలిపిన చందనంతో నరసింహుని అలంకరిస్తారు.
సింహా చలంలో ఈ చందరోత్తరణ తర్వాత నరసింహుని నిజరూప దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులులక్షలాదిగా తరలివస్తారు. బదరీనాథ్ క్షేత్రంలోని బదరీ నారాయణ స్వామి ఆలయాన్ని అక్షయ తృతీయ నాడే తెరుస్తారు. అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైంది. వర్జ్యం, రాహుకాలం ఇలాంటి వాటిని చూడకుండా ఏ కార్యాన్నైనా ఈ రోజున చే పట్టవచ్చు. ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి అర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసినా, అక్షయమైన సంపదలు, పుణ్యం ప్రాప్తిస్తాయని శాస్తవ్రచనం. ‘విఘ్నహర్త ప్రవాళ గణేశ పూజ’ శాస్త్రోక్తి ప్రకారం చేసినట్లయితే ఎన్నడూ, ఏ కార్యానికీ ఆటంకం కలుగదని విఘ్నేశ్వర భక్తుల నమ్మకం.

- హనుమాయమ్మ