అర్చన

సత్యము, చైతన్యమూ భగవత్ స్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మానవ సమాజములో ప్రజలు సుఖ శాంతులతో బ్రతకదలచి బ్రతికినంతకాలము ఆశ మోహముల మధ్య సతమతవౌతు జీవనము గడుపుచున్నారు. బ్రతుకు అలా సంతోషదాయకంగా వుండవలయునంటే ఈ జగమును సృష్టించిన భగవంతుడిని భక్తిచేత భజించుట పూజలు చేయుట ఉపవాసాలతో భగవంతుడిని మెప్పించి ఆయన అనుగ్రహము పొందుటకు పరితపిస్తు జీవనం చేయుచున్నారు. మరి కొంతమంది పూర్వజన్మ సుకృతంవలన ఈ జన్మయందు ధనికులుగా జన్మించియున్నారు. వీరు తమకు కలిగిన అదృష్ట ఫలాన్ని మాకు దూరం కాకూడదని ఎంచి భక్తితో భగవంతుడికి పూజలు, భజించుట, కార్యక్రమాలు చేయుచు కాపాడమని జీవిస్తున్నారు.
భగవంతుడిపై నమ్మకము కలిగి యున్నవారు కలరు. మరికొంతమంది భగవంతుడు వున్నాడని తలచితే కనపడడు. ఏ రూపమో తెలియదు. ఏ స్థావరమునందు కలడోయని తలచి బాధపడుచున్నారు.
కొంతమంది ఈ ప్రపంచమును ఇందులోని ప్రాణజీవములను సృష్టించిన కర్త వుండాలి కదా ఆయనే భగవంతుడని తెలియచెప్పుచున్నారు.
కొంతమంది మనకు కనపడు ఈ ప్రపంచములోని వస్తువులు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, అనునవి భగవంతుడే ఈ రూపాలుగా మారి కనుపించుచున్నాడని చెప్పుచున్నారు. మరికొందరు, భగవంతుడికి రూపం లేదు. నామము లేదు. కాని భగవంతుడు సత్యం. పుట్టుక లేదు. మరణము లేదు. కావున ఆయన నిత్యమై సత్యమై కాల నిమిత్తము గాకుండ వుండగలిగే సత్తా స్వరూపము. మనం తెలుసుకొనుటయే అభ్యంతరకరమని తెలిపుచున్నారు. మరికొందరు, ఈ జగము మానసిక వ్యవహారము తప్ప భగవంతుడి యొక్క మాయాజాలం కాదని, అసత్య స్వరూపము సత్య స్వరూపమునకు అంటబడదని చెప్పుచున్నారు. మరికొందరు. అసత్యమైన ఈ జగము ఎవరి ఆధారము లేకుండా వున్నది యంటే ఈ జగము మాయాజాలము కాదుగదాయని అంటున్నారు.
మరికొందరు. సత్యవస్తువును చూచినప్పుడు సత్యవస్తువుగా తెలియబడక మనోభ్రమతో ప్రపంచ రూపముగా గాంచినపుడు చిత్తభ్రమేకదాయని అంటున్నారు.
ఈ మానవుల యందు కలిగియున్న మనస్సు సామాన్యమైనది కాదు. మనస్సు మనస్సునే ప్రత్యేకంగా తెలుసుకోవాలని సంకల్పము కలిగిన యెడల భౌతిక ప్రపంచ జ్ఞానమును భౌతికమునందే వదలిపెట్టి స్వస్వరూప దర్శనమునకు సంకల్పము ఏర్పడిన యెడల ఈ ప్రపంచమునందు మనస్సుకు మించిన స్వరూపము లేదు. వుండదు.
ఈ విధంగా సత్యానే్వషణ చేయు వ్యక్తి ప్రత్యేకంగా జిజ్ఞాసువుగా పిలువబడుచున్నాడు. మనస్సు అనునది స్పటికములాగ పరిశుద్ధమైన స్వరూపము. స్పటికము ముందు రంగు కలిగిన వస్తువు ఉంచిన యెడల రంగులేని స్పటికము రంగు రూపంగా తెలియబడుతుంది. ఎరుపు, నలుపు, పసుపు, ఆకుపచ్చ, ఈ విధంగా అనేక రంగులు వుంచిన యెడల, అట్టి రంగు రూపముగా స్పటిక తెలియబడుతుంది. ఇదే లాగున మనస్సుముందు భావ సంకల్పము కలిగిన తత్‌భావపరంగా మనస్సు సంకల్పించుకొని, అట్టి భావకర్మలు చేయుటకు సంసిద్ధముగా నిలువకలుగుచున్నది. యద్భావం తత్‌భవతే ఇంతియే కాని మన స్సు పరిశుద్ధమైనదని తెలియకపోవడమే, మనస్సున భ్రాం తి వికసించి, సత్యమును తెలుసుకోలేకపోవుచున్నది.
సత్త్వగుణము, రజోగుణము, తమోగుణములు. ఈ మూడు గుణములు నిక్షిప్తమైనమనస్సు పవిత్రమైన, నిర్మలమైన, శుద్ధస్వరూపము. కావున మనస్సును గుణాతీతము గా మార్చడం యోగము. ఈ యోగమునందు మన స్సు గుణాతీతమైన యెడల మనకు కలిగిన సందేహములు పూ ర్తి గా నశించిపోవును. అప్పుడే అతను జ్ఞాని స్వరూపుడు.

- తిరుమూరు యుగంధరరాజు