పర్యాటకం

వెతలను తీర్చే జమలాఫురం వేంకటేశ్వరస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శనం స్వామి ఇస్తేనే లభ్యమయ్యేది. అంతేకానీ, ఎవరూ ఇచ్చేది కాదు. అదో నమ్మకం.
‘యద్భావం తద్భవతి’ ఇక్కడే, ఇదే విశిష్ఠత.
తప్పక దర్శించవలసిన క్షేత్రం శ్రీ జమలాపురం.
శ్రీపాద వేంకటేశ్వర నిలయం శ్రీపతి, పశుపతి, అద్వైత నిలయం, ఆనంద దర్శనం శ్రీ జమలాపురం క్షేత్రం. దర్శనంలో పడ్డ ఇబ్బందులలో ఏమైనా ఉంటే పూర్తిగా మరిచిపోతూ, ఏ భక్తుడైనా, ఇక్కడ ఏం కోరుకుంటాడు, ఏం కోరుకున్నా తప్పకుండా కోరేది మాత్రం ఒకటుంది. అదేం స్వామి అభేద పాద పునర్దర్శనం ప్రాప్తికలిగించు అని. ఈ కోరిక ఉత్తమమైనదని ఈ క్షేత్ర మహిమ తెల్పుతున్నది. ఈ క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలానికి దాదాపు 7 కి.మీ. దూరంలో జమలాపురమను గ్రామమందు శ్రీ వేంకటేశ్వరస్వామి స్వయంభూఃగా వెలిసినట్లు, పురాణాలు తెల్పుతున్నవి. ఎర్రుపాలెం మండలం వరకు ట్రైన్ సౌకర్యం కలదు. అక్కడనుండి ఆటోలు, బస్సులు కలవు. ఈ క్షేత్రం మహిమకలదని భక్తులెంతోమంది, కుల మత బేధములేకుండా స్వామి దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటుంటారు. ఇది తెలంగాణ, ఆంధ్ర సరిహద్దున కలదు. ఉభయ తెలుగువారు ఎంతోమంది ప్రతిదినం దర్శించుకుంటారు.
కలియుగ అద్వైత మహాప్రవక్తలు, అన్నమయ్య, గోపయ్య, త్యాగయ్యలు, రామభక్త శిఖామణులు. వారి కీర్తనలలో అద్వైత భావాలు కీర్తనలు వినిపిస్తుంటాయి. వారంతా ఈ క్షేత్రం దర్శించిన వారే.
భక్త్భివం అనేకత్వంలోంచి ఏకత్వం, ఏకత్వంలో అనేకత్వం దర్శింపచేసే చైతన్యాన్ని ఇస్తుంది. అదే ఇక్కడ కనిపించే మనకు శ్రీపాద శ్రీ వేంకటేశ్వరుడి రూపం. జమలాపుర క్షేత్ర విశిష్ఠత భక్తుల దర్శనం. వివాహం జరిగిన తరువాత అన్నమయ్య వైష్ణవ క్షేత్రాలు దర్శిస్తూ గడిపారు. అట్టి సమయంలోనే కృష్ణానదికి దక్షిణాన ఉన్న ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్ని దర్శించిన అన్నమయ్య ఆయా క్షేత్రాలలో కొలువై ఉన్న మూర్తులను దర్శించి కీర్తించాడు. అన్నమయ్య ఈ ప్రదేశాలలో కీర్త్తనలు చేసింది శ్రీరాముడి మీద. అందులో ఒకటి; ‘రామచంద్రా రాఘవా రాజీవ లోచన రాఘవా’లాంటివి పాడుతూ శ్రీ వేంకటేశ్వరుని శ్రీపాద జమలాపుర క్షేత్రం చేరినట్లు చరిత్ర తెల్పుతున్నది.
శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవ భక్తుడు. దక్షిణ భారతదేశ దండయాత్రలో ఓరుగల్లు (వరంగల్)పై విజయంతో శైవుడైనటువంటి గణపతి దేవుని, కుమార్తెను వివాహమాడిన అన్నపూర్ణతో జమలాపురంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకొని, ఆలయ నిర్మాణం చేసినట్లు చరిత్ర తెల్పుతున్నది. శ్రీరాముడు అరణ్యవాసం చేసే సమయంలో సప్తఋషుల దర్శనం చేసుకొని, వారి కోరికపై తరువాతి కాలంలో జాబిలి మహర్షి, తపస్సుతో శ్రీరాముడు ఇక్కడ అతని పాదములు నిల్పి, భరతునికి పాదుకలు ఇచ్చినట్లు పురాణ కథనం.
ఆ పాదుకలే మనకు కనిపించే శ్రీపాదం. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి పొందింది. పూర్వంనుంచి ఇక్కడికి భక్తులు అడవి అని భయపడకుండా ఎర్రుపాలెంలో దిగి, బండ్లుకట్టుకొని స్వామిని దర్శించుకొని, మొక్కులు తీర్చుకుంటుండేవారు.
జమలాపురం వంశస్థులు, కాశపస్య గోత్రికులు. సహాగోత్రికులు సప్తఋషులు. క్షేత్ర, రైభ్య, భృగు, అంగిరీస, దత్తాత్రేయ, విశ్వామిత్ర, భరద్వాజ మొదలైన మహాఋషులు, స్వామి పరివేష్ఠితులుగా జమలాపుర మూలపురుషుడికి కలలో కనిపించి, ఆశీర్వదించినట్లు వంశ చరిత్ర తెలుపుతున్నది.
ఈ వంశస్థులు గ్రామ కరిణీకం, బహుకాలం చేసినట్లు రెవిన్యూ రికార్డులు తెల్పుతున్నవి. వారి కాలంలో పట్వారీగా చేసినవారు గ్రామ ప్రజల మన్ననలు పొంది విధి నిర్వహణలు సక్రమంగాచేసి పేరుపొందారని గ్రామాభివృద్ధికి ఎంతో పాటుపడ్డారని గ్రామ ప్రజలు చెప్పుకుండేవారు. శ్రీపాద వేంకటేశ్వరస్వామి కటాక్ష వీక్షణాలు వారిపై ఎల్లప్పుడూ ఉండేవని వారి కాలంలో వారు ఆరోగ్యంగా దృఢంగా ఉండి బహుకాలం జీవించారని గ్రామ ప్రజలు అనుకుంటుండేవారు. ఇప్పటికీ ఈ వంశస్థులు, అక్కడక్కడ ఆయురారోగ్యాలతో ఇతర దేశంలోకూడా స్వామి కటాక్షవీక్షణాలతో విధి నిర్వహణలో ఉన్నారు.
బ్రహ్మోత్సవాలలో ఓ రచయిత్రి కలలో స్వామి కనిపించి పాద దర్శనం చేయించాడట. రెండవ రోజు ఆమె కల నిజమైందట. ఆలయంలో స్వామి నిజ పాదముల దర్శనం చేయించి ఆశ్చర్యపరచాడట.
జమలాపుర క్షేత్రం, శ్రీపాద వేంకటేశ్వరుడి అభేద రూపం చూసి తరించవలసిన క్షేత్రం. బహు పురాతనమైనది. మహిమగల క్షేత్రం. ఇట్టి తెలంగాణ ప్రాంత, చిన తిరుపతిగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం అభివృద్ధికి దూరంలో ఉన్నది. ఇంత మహిమాన్వితమైన క్షేత్రం అయనా ఇక్కడ భక్తులకు సౌకర్యాలు, చాలా తక్కువగా ఉన్నాయ. ఈ క్షేత్రం ఇరుప్రాంతాల తెలుగువారి ఆరాధ్యదైవం. గుర్తింపులేకుండా ఉన్నది. ఎర్రుపాలెం స్టేషన్‌వద్ద ‘జమలాపురం వేంకటేశ్వర స్వామి కి వెళ్లే దారి’ అని ఉంటే మన ప్రాంతాలవారే కాదు, ఇతర రాష్ట్రాలవారు కూడా స్వామిని దర్శించుకొనే వీలు ఉంటుందని అందరికీ ఈ క్షేత్రం సులభంగా తెలుసుకోవటానికి అవకాశం ఉంటుందని భక్తుల, సందర్శకుల, యాత్రికుల మనోభావన.

- జె. ప్రసాదరావు