ధర్మసందేహాలు

సీతాదేవిని రాముడు పరిత్యజించడం న్యాయమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* లంకలో సీతాదేవికి అగ్ని పరీక్ష చేసిన రాముడు, అయోధ్యలో ఎవడో అల్పుడు అన్నమాటలను పట్టుకొని దానే్న జనవాక్యంగా భావించి మరల ఆమెను త్యజించాడు. ఇది న్యాయమా? - టిఎస్‌ఆర్ ఆంజనేయులు
సినిమాలలోనూ హరికథలలోనూ ఎవడో అనామకుడి మాట పట్టుకొని శ్రీరాముడు సీతాపరిత్యాగం చేశాడని చెప్పబట్టి మీరీప్రశ్న వేస్తున్నారు. వాల్మీకి రామాయణంలో మాత్రం గూఢాచారులు శ్రీరాముడికి వార్తావిశేషాలుచెపుతూ-‘‘పట్టణాలల్లోనూ,పల్లెల్లోనూ నాలుగు మార్గాల కూడళ్లలోనూ జనులనేకమంది గుంపులుగా చేరి సీతాదేవి విషయంలో మీరు కామమోహితులై ధర్మాతిక్రమణ చేశారని చెప్పుకుంటున్నారు ప్రభూ!’’ అని విస్పష్టంగా చెప్పటంవల్లే శ్రీరాముడుభార్యాపరిత్యాగ నిర్ణయానికి వచ్చాడని స్పష్టంగా వుంది.
* దక్షయజ్ఞ సమయంలో సతీదేవి యోగాగ్నిని సృష్టిచేసుకొని దానిలోభస్మమైంది గదా! మరి ఆమె పార్ధివ శరీరాన్ని విష్ణుమూర్తి తన చక్రంతో ముక్కలు చేశాడని, ఆ ముక్కలు పడినచోట్లే అష్టాదశ శక్తిపీఠాలనీ మరోకథ వుంది కదా! భస్మమైన శరీరం ముక్కలెలా అయింది. - ప్రకాశరావు, విజయవాడ
రెండవ కథ ప్రకారం సతీదేవి పూర్తిగా భస్మం కాలేదు. యోగాగ్ని చేత ప్రాణత్యాగం మాత్రమేచేసింది. మరో ముఖ్యాంశం, సతీదేవిది పార్థివ శరీరం కాదు. అది దేవలోకోచితమైన తైజసశరీరం. దాని ఖండాలంటే అవి తేజః ఖండాలేగాని పార్ధివ మాంసమయ ఖండాలు కావు.
* విశ్వమంతటా విష్ణువే వ్యాపించియున్నాడు. బాగానే ఉంది. బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్నారు శ్రీ శంకరభఘవత్పాదులు. ఇవి పరస్పర విరుద్ధంగా లేవా? - సాయిరామానంద స్వామి
బ్రహ్మసత్యం - జగన్మిథా అని అన్నది వేదమే- ఇతరులు దాన్ని వివరించారు. అంతే ‘విష్ణువు’ అనే పదానికి అసలైన అర్థం అధిష్ఠాన చైతన్యము -అనే అంటే పరబ్రహ్మము అనే అంతేగానీ ఒక లోకనివాసి అయిన పరిమిత దేవత అని కాదు. ఈ విషయాన్ని గమనిస్తే మీరు చెప్పిన వాక్యాల్లో విరోధం లేదు.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.
vedakavi@serveveda.org