Others

సస్యప్రదాత శాకాంబరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మవారికి చైత్రమాసంలో జరిగే వసంత నవరాత్రులు, ఆశ్వీయుజమాసంలో జరుపబడే శరన్నవరాత్రులు (దేవీ నవరాత్రులు) లోక ప్రసిద్ధమైనవి. వసంత ఋతువు, శరధృతువులలో ప్రజలు నానా విధములైన రోగాల బారిన పడుతుంటారు. అలాంటి బాధలు రాకుండా ఉండడంకోసం అమ్మవారిని కొలుస్తారు. ఈ రెండు నవరాత్రులే ప్రసిద్ధమైనప్పటికి, దేవీ భాగవతంలో అమ్మవారి నవరాత్రి చతుష్టయం వివరించబడింది.
శ్లో॥ తథాషాడే మాఘే కార్యోమహోత్సవః,
చతుర్షు నవరాత్రేషు విశేషాత్పలదాయకః’’
దేవీ భాగవతాన్ని అనుసరించి అమ్మవారికి 1) చైత్ర మాసంలో జరుపబడే నవరాత్రులను వసంత నవరాత్రులని, 2) ఆషాఢ మాసంలో జరుపబడే నవరాత్రులను ‘శాకంబరీ’ నవరాత్రులని, 3) ఆశ్వీయుజ మాసంలో నిర్వహించే నవరాత్రులను శరన్నవరాత్రులని, 4) మాఘ మాసంలోని నవరాత్రులను మాఘ నవరాత్రులని పిలువడం జరుగుతుంది. విశేష ఫలములను కోరువారు నవరాత్ర చతుష్టయాన్ని ఆచరించాలని శాస్త్రం చెపుతుంది. ఆచరించాల్సిన విషయాలను కూడ శాస్త్రంలో విశదీకరించారు. కాని యథాశక్తి భక్తులు తమకు కలిగిన సంపదలనుబట్టి అమ్మవారిని ఆరాధించవచ్చును.
* శాకాంబరీ విశిష్టత
దేవీ భాగవతంలో చెప్పినట్లు ఆషాఢ మాసంలో జరిపే నవరాత్రులకు శాకంబరీ నవరాత్రులని పేరు. సంస్కృతంలో శాకం అంటే కూర అని, అంభరం అనగా వస్త్రం అని అర్థం. కూరగాయలను ధరించిన అమ్మవారు కనుక శాకంభరీ అనే నామముతో కొలుస్తున్నాము. గ్రీష్మ ఋతువు వెళ్లి వర్ష ఋతువు ఆరంభంలో విత్తనాలు, నాట్లు వేసే సమయం. ఈ సమయంలో శాకంబరిని ఆరాధించడం వలన అతివృష్టి, అనావృష్టి లేకుండా సువృష్టియై సస్య రక్షణ జరుగుతుంది. ప్రజలకు అన్నపానామృత ఫలములు సమృద్ధిగా లభించి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని మూర్తి రహస్యంలో చెప్పబడింది.
భూమిపై వంద సంవత్సరములు వానలు కురువక అనావృష్టి సంభవించును. అప్పుడు భూలోక వాసులు స్తుతింపగా, వారికోసం అయోనిజగా అవతరించి నూరు కన్నులతో చూచుచూ వారిని కాపాడెదను. అపుడు ప్రజలు నన్ను ‘శతాక్షీదేవి’ అని కీర్తింతురు. తర్వాత నా దేహము నుండి శాకములను పుట్టించి చనుల ఆకలిని తీరుస్తూ, వర్షాలు కురిసే వరకు ప్రజల ప్రాణరక్షణ గావించెదను. అపుడు శాకంబరిగా ప్రసిద్ధి పొందెదను. అదే సమయంలో దుర్గముడు అనే రాక్షసున్ని చంపి, దుర్గాదేవిగా కీర్తింపబడతానని స్వయముగా అమ్మవారు చెప్పినట్లు చండీ సప్తశతిలో ప్రమాణాలు కనిపిస్తున్నాయి. శాకంబరీదేవి తన పిడికిలి యందు వరి మొక్కలను పట్టుకుని ఉంటుంది.
ఇతర చేతులలో పుష్పములు, ఫలములు, చిగురుటాకులుంటాయ. ఈ శాక సముదాయములు రసముగలవై జీవుల ఆకలి దప్పికలను తీర్చుతాయ. కనుక మనం అమ్మను శాకాంభరీ గా కొలిచి తరిద్దాం.

- వేదాంతం హరికుమార్