Others

అంతా రామమయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారద భక్తిసూత్రాలల్లో చెప్పినట్లు అపారమైన అచంచలమైన ప్రేమే భక్తి. భక్తిరేవ గరీయసి - భగవంతుని చేరడానికి ఉన్న అన్ని మార్గాల్లో అతిశ్రేష్ఠమైనది సులభమైనది భక్తి ఒక్కటే. ప్రతి ప్రాణి కూడా భగవంతుని చేరడానికి యత్నిస్తుంటుంది అన్న భక్తుల భావనకు అద్దం పట్టినట్లుగా అక్కడక్కడ కొన్ని జంతువులు భగవంతుని నీడకు చేరుతుంటాయ.
దేవాలయం దగ్గరకో లేక భగవంతుని పటం ఉన్న దగ్గరో అవి వాసం చేస్తుంటాయ. అట్లానే మరికొన్ని జంతువులు తమ వైరి వర్గపు జంతువులతో కూడా స్నేహం చేస్తుండడం మనం అప్పుడప్పుడు గమనిస్తాం. ఇవన్నీ కూడా భగవంతుని చిత్రితములే. అగస్త్యుడు, వశిష్ఠుడు, కణ్వులు వంటి లాంటి లోకోత్తరమైన మహా మునులు లోక కల్యాణేచ్ఛతో కార్యాలు చేస్తుంటారు. అటువంటి వారి ఆశ్రమాల్లో కూడా వైరి వర్గ జంతువులు కలసి మెలసి ఉంటాయని మనకు పురాణాలు చెప్తాయ. దీనికంతా కారణం కేవలం భగవంతుడు ఒక్కడని నమ్మడం. భగవంతుడొక్కడే అయనపుడు ఆ భగవంతుడు సర్వమూ అయనప్పుడు ద్వంద్వ భావాలు ఎక్కడ ఉంటాయ? వారు వీరను తేడాలేముంటాయ. కనుక అది పిల్లి అయనా, పులి అయనా ఒక్క ప్రాణిమాత్రమే. ఆ ప్రాణి జీవాత్మ పరమాత్మ స్వరూపమే. కాని ఉతృష్టమైన జన్మను పొంది అనేక పుణ్యకార్యాలు చేస్తూ మంచిచెడు వివేకాన్ని అలవర్చుకుని కూడా మనుష్యుల్లో కొందరు అసమానతలను పెట్టి పోషిస్తున్నారు.
భగవంతుని తత్వాన్ని తెలుసుకొంటే అంతటా పరబ్రహ్మమే కనబడుతాడు. ఆయనకు నా నీ అనే భేదాలు లేవు. అందరూ సమానమే. అందుకే శ్రీకృష్ణుడు నదీనాం సాగరో గతిః అన్నట్లు భక్తి రూపాలు ఎన్ని ఉన్నా అవి అన్నీ చివరకు ననే్న చేరుతాయ అని భగవద్గీతలో చెప్పాడు. అందుకే ఉత్తమమైన జన్మను పొంది కూడా హెచ్చుతగ్గుల చిక్కుల్లో ఇరుక్కుపోక సరియైన దారిలో భగవంతుడే అన్నింటా నెలకొని ఉన్నాడన్న జ్ఞానంతో వ్యవహరించాలి. అట్లా వ్యవహరించినవారు ఈ కలియుగంలో చనిపోయనా కూడా చిరంజీవులుగానే పరి గణించబడుతున్నారు.
అటువంటి వారిలో రామదాసు ఒకరు. కంచెర్ల గోపన్నగా ఉన్న రామదాసు తన మేనమామల సాయంతో ఆనాటి నవాబు కొలువులో తహసిల్ద్దార్‌గా పనిచేయడం ఆరంభించాడు. తనలో ఉన్న రామభక్తికి బీజాలేసే తాళ్లపాక దమ్మక్కదగ్గర ఉన్న రామా దులను చూచాడు. వెంటనే శిస్తు వసూలు చేయమని చెప్పిన నవాబు మాట మేరకు వసూలు చేసిన పైకాన్ని రామాలయం కోసం వెచ్చించాడు. అద్భుతమైన రామాలయ నిర్మాణాన్ని చే సాడు. ఆ పన్ను డబ్బులనే పెట్టి రామాదులకు నగలు చేయంచాడు. విషయం తెలుసుకున్న నవాబు తహసిల్‌దారుగా ఉన్న గోపన్నను విషయం అడిగాడు. ధనాన్ని ఖజానాకు జమ చేయమని చెప్పాడు. కాని రామదాసు తన దగ్గర లేదని అదంతా రామునికోసం ఖర్చు పెట్టానని చెప్పాడు. నవాబు నాకు అదంతా తెలియదు ఆ రాముణ్ణే అడిగి డబ్బు కట్టమని చెప్పి జైలులో నిర్బంధించాడు. నానా రకాలుగా హింసించాడు. ఆ నవాబు పెట్టే హింసను తట్టుకోలేక రాముణ్ణి వేడుకున్నాడు. నిలదీసాడు. కీర్తించాడు. కరుకు మాటలతో నొప్పించాడు. ఏది చేసినా రాముడే తన దిక్కని నమ్మాడు. అలాంటి అచంచలమైన నమ్మకాన్ని పెట్టుకున్న తన భక్తుడిని రాముడు చూస్తూ వూరుకొంటాడా? లేదు కదా.
అందుకే ఆ రాముడే తన అనుజుడ్ని వెంటబెట్టుకుని నేరుగా నవాబు దగ్గరకు వచ్చి ఇదిగో ఆ గోపన్న కట్టాల్సిన పైకం నీవు జమ చేసుకొని ఆ గోపన్నను ఖైది నుంచి విడుదల చేయమని చెప్పారు. అచ్చెరువొందిన నవాబు రామదాసుగా మారిన గోపన్న దగ్గరకు పరుగెత్తాడు. విషయం చెప్పాడు. క్షమించమని వేడుకున్నాడు. నవాబు అదృష్టానికి పొంగిన రామదాసు నవాబును గొప్పవాడంటే రామదాసు ఘనతను తెల్సుకొన్న నవాబు నీవే పరమభక్తాగ్రేసరుడవని పలికాడు. రాముణ్ణి దర్శించిన నవాబు అయనా రామదాసు అయనా ప్రాణులేకదా. కనుక అంతా రామమయం అని తెల్సుకుంటే చాలు. భగ వతంతుని తత్త్వాన్ని అర్థం చేసుకొంటే చాలు. భక్తే పరమోన్నత మార్గమని తెలుస్తుంది. భగవంతుడే సర్వాంతర్యామి అని తెలుస్తుంది.

- యాదయ్య