Others

సూర్యోపాసనతో ఐశ్వర్యం, ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైత్రమాసంలో ధాతనే పేరుతోను, వైశాఖ మాసంలో అర్యయుడు అనే పేరుతోను, జ్యేష్టమాసంలో మిత్రుడు అనే పేరుతోను, ఆషాఢ మాసంలో వరుణుడు అనే పేరుతోను, తిరిగే సూర్యభగవానుడు మాఘమాసం పూముడు అనే పేరుతో సంచారం చేస్తాడు. ఈ మాసంలోనే తష్ట్యాపేరును ధరించిన సూర్యుడు బ్రహ్మంత మహర్షిని, కంబల సర్పమును, తిలోత్తమ అప్సరసను, చీకుడు రాక్షసుని, శతజిత్ అనే యక్షుని, ధృడరాష్ట్రుడు అనే గంధర్వుని వెంట బెట్టుకొని చిత్రవర్ణంలో తొమ్మిది వేల కిరణాలతో వెలుగొందుతూ సంచరిస్తాడనీ పురాణాలు చెప్తున్నాయ. మాఘమాస ఆదివారాల్లో ‘శివాయనమః’ అనే మంత్రాన్ని పఠించటంతోపాటు నిమ్మకాయలు పండ్లను నైవేద్యం చెయ్యాలి. ఈ మాసంలో సూర్య భగవానుని పూజిస్తే అనారోగ్యం దరిదాపులకు కూడా రాదని శాస్త్రాలు ఘోషిస్తు న్నాయ. దానాలు చేయని వారికి, లోభత్వం ఉన్నవారికి అనారోగ్యాలు కలుగుతాయని పురాణ వచనం. సూర్య భగవానుని పూజించిన వారికి మాత్రం ఐశ్వర్యాలతోపాటు ఆరోగ్యం లభిస్తుందని బ్రహ్మ, మార్కండేయ, మత్స్య, బ్రహ్మాండ, భవిష్యాది పురాణాలు చెప్తున్నాయ. సూర్యారాధన గురించి రామాయణ భారత భాగవతాలు వివరిస్తున్నాయ. అంతేకాక ఋగ్వేద, యజుర్వేదాల్లో ఉపనిషత్తులలో కూడా సూర్య ప్రశస్తి ఉంది. మాఘమాసంలో మందసప్తమి, భానుసప్తమి వ్రతాలు, ఆచరించాల్సినవి. సూర్య భగవానుని కోసం వ్రతాలు నోములు నోయలేని వారికి మాఘమాస సప్తమి తిథినాడు రథసప్తమి వ్రతం చేస్తే సంపూర్ణమైన సూర్యానుగ్రహం లభిస్తుంది. ఈ రథసప్తమినాడు నదీస్నానం చేయాలి. మాఘశుద్ధ సప్తమినాడు జిల్లేడు లేదా రేగు లేదా చిక్కుడు ఆకులను అక్షతలతో లేదా రేగు పళ్ళతో తల మీద భుజాల మీద ఉంచుకొని స్నానం చేయటం కూడా సంప్ర దాయం. ఆ తరువాత సర్వాలంకారాలతో ఓ రథాన్ని తయారుచేసి మంటపంలో దాన్నుంచి కుంకుమ, గంధాక్షతలతో పూజించి సూర్యభగవానుని ప్రతిమను ఆ రథంలో ఉంచి అర్చించాలి, చిక్కుడు కాయలకు చీపురుపుల్లలు గుచ్చి సూర్యరథం తయారుచేయడం కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. సూర్యభగవానునికి ఎదురుగా ఆవు పిడకలతో దాలిచేసి, దానిమీద పాయసాన్ని తయారు చేసి సూర్యభగవానునికి నివేదిస్తారు. మహాభారతంలో రథసప్తమి వ్ర తాన్ని గూర్చి శ్రీకృష్ణ్భగవానుడే స్వయంగా ధర్మరాజుకు తెలిపాడు.
కనుక మానవులు తమ తమ ఇష్టకార్యసిద్ధి కోసం సూర్య భగవానుని పూజిస్తే వారికి తప్పక కోరికలు నెరవేరుతాయ. సత్రా జిత్తు కూడా సూర్య భగవానుని ప్రార్థించి శమంతకమణిని పొందినట్టు కూ డా పురాణాలు చెప్తున్నాయ. పురాణ పురుషు లెంతో మంది సూర్యారాధన చేసినట్టు చెప్తారు. రథసప్తమి వ్రతాచరణ వల్ల విజయం సిద్ధించటంతోపాటు ఆయురారోగ్యాలు వృద్ధిచెందటం తథ్యం.

- సి.ఎన్.ఆర్