Others

శాంతించు.. ప్రేమించు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ జగత్తులోని జీవరాసులన్నింటికన్నా ఉత్కృష్టమయినది మానవ జన్మ. మనిషికి తక్కిన జీవరాసి కంటే అధికంగా ఉన్నవి, మేధోశక్తి, భావప్రకటనకి అనుకూలమైన శరీర నిర్మాణం. దానికి ఒక భాష, ఏ ప్రాంతాల వారికి వారి వారి భాష. అందువల్ల మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ లక్షణాలను వాడుకుని చక్కని జీవితం గడపడానికి వీలుగా మలుచుకోవడం మంచిది. జంతువులు బ్రతుకుతాయి. మనిషి జీవించాలి. మానవునికున్న మేధోశక్తి అపురూపం, ఆలోచనలేని కోపం కూడా మానవునికి ఉన్నదే. ఆ కోపం అదే మనిషిని నిలువెల్లా దహించివేస్తుంది. కోపం ఎదుటి వారిని నాశనం చేస్తుందని అనుకొంటే ఎవరికైతే కోపం కలుగుతుందో వారిని కూడా నాశనమే చేస్తుంది. అందుకే శతకకారులు ‘‘తనకోపమె తన శతృవు, తన శాంతమే తనకు రక్ష’’ అని అన్నారు. శాంతం మానవుని ఉచ్ఛస్థితికి తీసుకుని వెళ్ళగలదు. శాంతికోసం ఎన్ని కష్టాలుపడినా ఆ శాంతమే వారిని రక్షించగలదు. అందుకు తన ధర్మాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించగలగాలి. మానవుడు తన ఎదుటి వారిని హాస్యంగానో ద్వేషంతోనో నరం లేని నాలుకతో మాటలు వదులుతాడు... వదరుతాడు. అవి ఎదుటివారి మనసులని గాయపరుస్తాయి. మాట సౌమ్యంగా ఉంచుకోవడమనేది ప్రతి వారికీ అత్యవసరం.
సంఘం లేకుండా మనిషి జీవించలేడు. సంఘజీవి, ఒంటరిగా బ్రతుకలేడు. అందుకని మనిషి సంఘాన్ని, తోటివారిని, ముఖ్యంగా ఇరుగుపొరుగులతో సఖ్యత పాటించం ఆవశ్యకం. వారిపట్ల ప్రేమగా మెలగడం అవసరం. ప్రేమించడం ప్రేమించబడడం అనేది మానవులకి ఒక్కరికే పరిమితం.
పెంపుడు జంతువులు కూడా అప్పుడప్పుడూ ప్రేమని ప్రకటిస్తూండడం కద్దు. ముఖ్యంగా కుక్క వంటివి. అవి తన యజమానిని విపరీతంగా ప్రేమిస్తాయి. తన యజమానిని ఆయన కుటుంబాన్ని ప్రేమిస్తూంటాయి. మరి ఒకరెవరు ఇంటిలోనికి రావాలన్నా యజమాని ఆజ్ఞతో మాత్రమే. అది ప్రేమ అనే కంటే విశ్వాసం అని వ్యవహరిస్తాము.
ఒక మంచి మనిషిగా పొరుగు వారిని, కన్నవారిని, దేశాన్ని ప్రేమించడం అత్యంతావశ్యకరం. మన ఇరుగు పొరుగులు సుఖంగా వుంటే మనకూ సుఖమే కలుగుతుందనే విషయాన్ని మరువకూడదు. దేశం పట్ల ప్రేమ కలిగి ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందనడంలో ఏ విధమైన సందేహం అక్కరలేదు.
మనిషి పాటించవలసిన ధర్మాలలో దానగుణం ఒకటిగా చెప్పబడింది. దానిని పాటించాలి. మనకున్న కొద్దిపాటి నుంచే దానం చెయ్యగలం. తనవద్దనున్న ఉసిరి కాయలను శ్రీ శంకరాచార్యుల వారికి దానం చేసిన మహిళ బంగారు ఉసిరికాయలు పొంది ధన్యత చెందింది కదా! మన దానం కొన్ని వందల వేల రెట్లతో పెరిగి తిరిగి మనకే చేరుతుందనేది సత్యం. దాని రూపం మారిపోవచ్చు. కాని ప్రతిఫలం మనకి వచ్చి చేరుతుంది. దానిని మనం గ్రహించగలగాలి. కొన్ని మతాలలో తమ తమ సంపాదనలోని కొంత భాగాన్ని దానం చెయ్యమని వారి మత గ్రంథాలు తెలుపుతున్నాయి. అందుకే సనాతన ధర్మంలో దానానికి అత్యంత ప్రాముఖ్యత కల్పించబడింది. తన దానంతో దాన గ్రహీత ఎంత సంపాదించేస్తున్నాడన్న సంగతి గానీ, మన దానంతో అతనేమి చేస్తన్నాడని గానీ ఆలోచించి దానం చెయ్యడం అవివేకం. కవచకుండలాలు దానంగా అడిగిన ఇంద్రుణ్ణి వాటినేం చేసుకుంటారని కర్ణుడు అడగలేదు. ఇచ్చినదే తడవుగా మరో వరం పొందాడు. దాతలకి అటువంటి ఆలోచన రాకూడదు. కేవలం దానం చేశాం అనే తృప్తి, ఆనందం, దాతగా మనిషి మిగుల్చుకోవాలంటే.. దానం చేశాక ఆ విషయం మరిచిపోవడం అత్యంత ఉత్తమ మార్గం.

- కె.వి.సుబ్రహ్మణ్యం