Others

ఫ్రాణిసేవ.. పరాత్పరుని భజన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ జీవనంలో వేదాలకు, ఉపనిషత్తులకున్న ప్రాధాన్యత వేటికీ లేదు. జాతిలో చేతనత్వాన్ని నింపేందుకు సత్యానే్వషణ చాలా వరకూ ఉపకరిస్తుంది. వేదవిహితమైన హైందవ ధర్మం సూర్యచంద్రులున్నంతవరకూ కొనసాగుతూనే ఉంటుంది. నిజాన్ని నమ్మి, వాస్తవాన్ని ప్రేమించే హైందవ సంస్కృతి నిత్య శోధనతో సశాస్ర్తియమైన అంశాలను ఆవిష్కరించింది. హైందవ ధర్మ పరిరక్షణ, భారత జాతి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు మహనీయులు చేసిన, చేస్తున్న కృషి అనిర్వచనీయమైనది. మనిషిని సన్మార్గంలో నడిపించే శక్తి ఉన్న హైందవ సంస్కృతి, సంప్రదాయాలకు ఇటీవల కాలంలో ముప్పు వాటిల్లుతోంది. ఆ ముప్పును తప్పించి, తిరిగి హిందూ ధర్మ, సంస్కృతులను ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు వేద పండితులు ఇప్పటికీ శక్తివంచన లేకుండా కృషి సల్పుతూనే ఉన్నారు. అందులో విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ఒకరు. చిన్ననాడే సన్యాసం స్వీకరించారు. యుక్త వయసులోనే ప్రాంపచిక వ్యామోహాలను పక్కనపెట్టి, సత్యానే్వషణకు హిమాలయాలకు బయల్దేరారు. ఎందరో మునులను, మహర్షులను, సత్పురుషులను, ఆధ్యాత్మికవేత్తలను కలిసి, అనేక విషయాలను గ్రహించిన స్వరూపానందేంద్ర స్వామి విశాఖ జిల్లా పెందుర్తికి సమీపంలోని చినముషిడివాడలో శారదా పీఠాన్ని స్థాపించి, హిందూ ధర్మ వ్యాప్తికి విశేష కృషి చేస్తున్నారు. మానవ సేవే మాధవ సేవని తాను నమ్మిన సిద్ధాంతాన్ని తు.చ తప్పకుండా అమలు చేస్తున్నారు. హైందవ పవిత్రతను దెబ్బతీసే శక్తులను ఆధ్యాత్మిక ప్రబోధంతో మతాచారాలను కాపాడుకుంటూ వస్తున్నారు.
1964 నవంబర్ ఎనిమిదవ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలం సమీపంలోని దేరసాం గ్రామంలో నాగుల చవితి రోజున కళ్యాణి, చిన్నయ్యపంతులు దంపతులకు జన్మించిన బిడ్డే స్వరూపానందేంద్ర. స్వామి అసలుపేరు వరాహలక్ష్మీ నరసింహం. అన్నప్రాసన రోజున నరసింహం భగవద్గీతను తాకి, అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. విద్యార్థి దశ నుంచే ఆధ్యాత్మిక చింతనను కనబర్చిన నరసింహం మృత్యువు నుంచి అమృతత్వం వైపు, చీకటి నుంచి వెలుగు వైపు నడిపించే హిందూ ధర్మ పతాకాన్ని చేతబూని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. మనువులు, వైవసత్వ మనువులు, యోగులు, సద్గురువులు, సాధుపుంగవులు మన నేలమీదనే జన్మిస్తారేంటో మన దేశం ఎంత గొప్పదో కదా అనుకున్నాడు. ఈ ఆలోచనలతో విశాఖ చేరుకున్న నరసింహానికి రాఘవేంద్రస్వామి మఠం ఆశ్రయమిచ్చింది. మంత్రశాస్త్రంలో అందెవేసిన రామచంద్రభట్ వద్ద శిష్యరికం చేశారు. ఆయన చేతుల మీదుగానే బ్రహ్మోపదేశం పొందారు. ఆ తరువాత సన్యాసాన్ని స్వీకరించారు. నరసింహం సన్యాస నామం స్వరూపానందేంద్ర. వెనువెంటనే నరసింహం హరిద్వార్ వెళ్లి, సాధువులు, సన్యాసులు, మహిమాన్వితుల నుంచి భగవత్‌తత్వాన్ని తెలుసుకున్నారు.
అక్కడి నుంచి తిరిగి విశాఖ చేరుకున్న నరసింహం ఒక ఆశ్రమాన్ని స్థాపించేందుకు సిద్ధపడ్డారు. భగవదనుగ్రహంతో అంచెలంచెలుగా నిధులు సమకూరుతూ వచ్చాయి. పీఠాధిపతి స్థానంలో కూర్చున్న స్వరూపానందేంద్ర సకల విద్యా స్వరూపిణిని ఆ పీఠంలో ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. సచ్చిదానందేంద్ర సరస్వతీ స్వాములు తమ ప్రియ శిష్యులైన అద్వైతానందేంద్రకు ఆ జ్ఞానసరస్వతి స్ఫూర్తిని అందచేస్తే, ఆయన ద్వారా స్వరూపానందేంద్ర సరస్వతిగా రూపాంతరం చెందింది. శారదా సిద్ధాంతాన్ని ఆది శంకరుల వారి నుంచి మొదలుపెడితే, దాన్ని అనుసరిస్తున్న నాలుగో మహాస్వామి స్వరూపానందేంద్రగా మనకు తెలుస్తుంది. విశాఖలోని శారదా పీఠానికి 1998 మే మూడున శంకుస్థాపన జరిగింది. చిన్నపాటి సన్యాసి కుటీరమైన ఈ ఉపనిషద్విహార్ ప్రాంతంగా అనతికాలంలోనే ప్రపంచస్థాయి శంకరపీఠంగా ఎదిగింది. 1999 జనవరి 27న పీఠంలో దాసాంజనేయ, వల్లీ దేవసహిత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి తదితర అనేక విగ్రహాలను ప్రతిష్ఠించారు. నిత్యం వేద నాదం ఆలపించే ఈ పీఠం ఇక్కడికి వచ్చిన వారికే కాక చుట్టుపక్కల వారికి కూడా ఆసక్తిని కలిగిస్తుందంటారు. నిత్యం హోమం నిర్వర్తిస్తారు. వేద మంత్రాలు మరుగున పడుతున్న ఈ సమయంలో వాటిని పరిరక్షించేందుకు స్వరూపానందేంద్ర కంకణబద్ధులయ్యారు. వేద పాఠశాలను ఏర్పాటు చేశారు. నాలుగు వేదాల్లో పిల్లలను నిష్ణాతులను చేసేందుకు ఘనాపాటీలను ఇక్కడ నియమించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు ఇక్కడ కొదవ లేదు. ముఖ్యంగా హిందూ మత ప్రచారం, హిందూ మతవ్యాప్తికి స్వరూపానందేంద్ర మహాస్వామి చేస్తున్న ప్రయత్నాలు అందరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. భారతీయ సంపదైన గోవులను రక్షించాలన్న ధ్యేయంతో గోపూజలను కూడా నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అమాయక గిరిజనులను అన్య మతస్తులు ప్రలోభపెట్టి మత మార్పిడులకు ప్రయత్నిస్తున్నారు. వీటిని నిరోధించేందుకు స్వరూపానందేంద్ర సరస్వతి ఏజెన్సీలో హిందూ దేవాలయాలను నిర్మిస్తున్నారు. అలాగే వందలాది మంది గిరిజనులను తిరుమలకు పంపించి వెంకన్న దర్శనం చేయిస్తున్నారు. గిరిజనులకు, పేదలకు వారికి కావలసిన నిత్యావ సరాలైన దుప్పట్లు పంచిపెడుతున్నారు. పర్వదినాల్లో పీఠంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు, అనేక అంశాల్లో నిష్ణాతులైన పండితులను రప్పించి సదస్సులు నిర్వహిస్తున్నారు. ఏటా చాతుర్మాస దీక్షలు రుషికేష్‌లో నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో హిమాలయాల్లోని సాధువులు, సంత్‌లను కలిసి చర్చాగోష్ఠి నిర్వహిస్తూ వస్తున్నారు.

- కె.వి.జి. శ్రీనివాస్