Others

ఇదండీ అంతరంగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాల్మీకి మహర్షి రామాయణంలో ఎందరు మహర్షులనో పరిచయం చేసాడు. ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి. ఆ మహర్షుల చరిత్రలు చదివినపుడు గ్రహించిన విషయాలను అవగాహన చేసుకుని జీవితాన్ని సరిదిద్దుకోవడంలో ఉన్నది నేర్పు. రాముడు అరణ్యవాస ప్రారంభంలోను చివరిలోను భరద్వాజ మహర్షిని సందర్శిస్తాడు. చిత్రమేమంటే భరద్వాజ మహర్షి తనను సందర్శించిన రాముడికి రెండుసార్లు భరతుడికి ఒకసారి విందు ఏర్పాటు చేసాడు. ముందు రాముడిని విందు సంగతి చూద్దాము. రాముడు ఆరణ్యవాస ప్రారంభంలో భరద్వాజ మహర్షిని సందర్శించి నమస్కరించి తాను అరణ్యవాసం చేయడానికి అనువైన ప్రదేశం గురించి అడిగాడు. మహర్షి తన ఆశ్రమంలో వుండమన్నాడు. రాముడు కాదన్నాడు. మహర్షి రాముడిని పంచవటి-అయిదు పెద్ద మర్రిచెట్లువున్న ప్రాంతం దగ్గర వుండమన్నాడు. సీతారామ లక్ష్మణులకు కందమూలాలతో కూడిన ఆహారం మాత్రమే సమకూర్చాడు. రాముడు రావణ సంహారం అనంతరం వనవాసం ముగించుకుని అయోధ్యకు వస్తూ 14 ఏళ్ల తర్వాత మళ్లీ భరద్వాజ మహర్షిని సందర్శించాడు. భరద్వాజ మహర్షి అప్పుడు సీతారామలక్ష్మణులకు పంచభక్ష్యాలతో కూడిన రాజభోజనం సమకూర్చాడు. ఏమీ తెలియనట్టుగా రాముడు ఆయనతో మహర్షీ మీరు నాకు కిందటిసారి కందమూలాలతో ఆహారం సమకూర్చారు. ఈసారి రాజభోజనం ఏర్పాటు చేసారు కారణమేమిటన్నాడు. మహర్షి నాడు నీవు అరణ్యవాసానికి బయలుదేరావు కనుక దానికి తగిన కందమూలాల ఆహారం సమకూర్చాను. రేపటినుండి రాజుగా రాజ్యమేలబోతున్నావు. దానికి అనుగుణంగా రాజభోజనం ఏర్పాటు చేసానన్నాడు. దీనిని బట్టి ఎవరికైనా వారికి తగిన ఆహారం సమకూర్చాలి. అందరికీ ఒకటే పనికిరాదని తెలుస్తుంది.
భరతుడికి కూడా సింహాసనం ఏర్పాటుచేసి మహర్షి విందుకాహ్వానించాడు. భరతుడు మర్యాదగా సింహాసనానికి నమస్కరించి నేలపై దర్భాసనం మీద కూర్చుని తన గడుపబోయే నందిగ్రామ జీవనానికి తగిన ఆహారం స్వీకరించాడు. మహర్షి సింహాసనాన్ని ఏర్పాటుచేసింది భరతుడి మనసును గ్రహించడానికి పెట్టిన పరీక్ష. భరతుడు తాను రాజుకానని అవసరమైతే రాజప్రతినిధిగా వుంటానంటూ సింహాసనానికి నమస్కరించి కింద కూర్చుని మహర్షి పెట్టిన పరీక్షలో నెగ్గాడు.

- మేరిక పూడి సీతాపతిరావు