Others

కార్తిక మహత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్నానం, దానం, ఉపవాసం, అభిషేకం, కన్యాదానం, అన్నసమారాధన ఇలా ఏ పుణ్యకార్యం చేసినా అధికమైన ఫలాన్నిచ్చే మాసంగా కార్తికం కీర్తించబడుతుంది. వీటిలో జ్ఞానానికి ప్రతీకయైన దీపదానం మరింత విశిష్టమైందిగా చెబుతారు. గోరంత దీపం ఉంటేచాలు కొండంత విజ్ఞానాన్ని సంపాదించవచ్చునని అంటారు. దీపారాధనకు ఆవునేతినిగాని, నువ్వుల నూనెనులేక విప్పనూనెను, అవిశనూనెను అదీ లేకపోతే ఆముదంతోనైనా దీపం వెలిగించిన వారికి, ఆరిపోయే దీపాన్ని ఎగదోసి దీపం వెలిగేట్టుగా చేసినవారికి, దీపదానం చేసినవారికి వచ్చే పుణ్యాన్ని లెక్కపెట్టగలేము అంటారు శివభక్తులు. దీనికి సంబంధించి కార్తికపురాణం - పూర్వం దేవశర్మయను బ్రాహ్మణునికి శివశర్మ అనే కుమారుడు ఉండగా అతడు తండ్రి చెప్పినమాట వినక వ్యతిరేకం ప్రవర్తించడం చేయగా దేవశర్మ శివశర్మను ఎలుకవై పొమ్మని శపించాడు. ఆ శాపానికి భయపడి తన తప్పును తెలుసుకొన్న శివశర్మ తనను క్షమించమని కోరి తాను శాపవిముక్తుడిని చేయమని కోరాడు. కార్తికమహాత్మ్యాన్ని విన్ననాడు నీకు శాపవిముక్తి కలుగుతుందని దేవశర్మ చెప్పగా శివశర్మ ఎలుకరూపంలో అడవిలోని రావిచెట్టు దగ్గర బతికనారంభించాడు. కొన్నాళ్లకు అటుగా విశ్వామిత్రుడు వెళుతూ ఉసిరిక చెట్టుకింద కూర్చుని కార్తికపురాణమహాత్మ్యాన్ని తన శిష్యులకు చెబుతుండగా అనాలోచితంగా ఈ ఎలుకరూపంలో ఉన్న శివశర్మ వినడం జరుగుతుంది. అపుడు ఆ శివశర్మకు శాపవిముక్తి కలిగి తిరిగి బ్రాహ్మణరూపం పొంది తను చేసిన తప్పుకు కలిగిన శిక్ష మరియు ఇపుడు పొందిన శాపవిమోచన కథనంతా వారికి చెప్పి కార్తిక పురాణమహాత్వాన్ని కీర్తించాడు. అటువంటి మహాత్వం కలిగిన కార్తికమహాత్మ్యం ను చదివి శివుని అనుగ్రహాన్ని ఈకార్తికంలో అందరం పొందుదాం.

- సత్య