మెయిన్ ఫీచర్

తల్పగిరి.. మరో శ్రీరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మలచిత్తంతో సన్మార్గంలో సమబుద్ధి, సాధుచరిత కలిగిన సజ్జనులకు భగవంతుడు తనకు తానై కనిపించేవాడని పురాణాలుచెబుతాయి. కలియుగంలోను ఎందరో మహానుభావులు భగవంతుణ్ణి మెప్పించినవారున్నారు. భక్తితత్వంతో మునిగిన భాగవతోత్తముల దగ్గరకు భగవంతుడే నడిచివచ్చేవాడు. వారు కోరుకున్న పనులను చేసేవాడంటారు. తన భక్తులు ఏవిధమైన కష్టాలు పడకూడదనుకొనే దయాసముద్రుడు భక్తులకు కలిగే కష్టాలను తానే అనుభవించేవాడు అనే చరిత్ర కూడా పురాణాలు చెబుతాయి. జ్ఞానదేవుడు, నామదేవుడు, సక్కుబాయి, కబీరుదాసు, వీరందరూ స్వామిని కనులారా చూచినవారే. భగవంతుడిని చూడడానికి కేవలం నిర్మల మనస్సు, అచంచలమైన విశ్వాసం ఉంటే చాలు భగవంతుడు ఏ రూపంలోకావాలనుకొన్నవారికి ఆరూపంలో కనిపిస్తాడనే సాక్ష్యాలు మనభారతదేశంలో కోకొల్లలుగా ఉన్నాయి.
అటువంటి కర్మభూమియైన భారతదేశంలో ఒకానొక కాలంలో పుండరీకుడను బ్రాహ్మణవంశసంజాతుడు ఒకడు వుండేవాడు. తల్లిదండ్రులు చెప్పినమాట వినక దుర్వసనాలకు లోనయి వంశమర్యాదను కాలరాశాడు. సంప్రదాయాలను కట్టుబాట్లను తెంపుకొని దురాచారాలకు అలవడ్డాడు. తల్లిదండ్రులను హింసించేవాడు. కట్టుకున్న భార్యను సైతం బాధించేవాడు. ఇంట్లో డబ్బును తీసుకువెళ్లి భోగాలను అనుభవించడం మొదలుపెట్టాడు. ఇలా దురవ్యసనుడైన తమ కుమారుడిని బాగుచేయమని సన్మార్గుడిని చేయమని అతని తల్లిదండ్రులు నిరంతరం ఆ కృష్ణ్భగవానుని కోరుకునేవారు. పుండరీకుని భార్యసైతం అలనాడు గజేంద్రుణ్ణి రక్షించినట్లుగాను, చిరుత ప్రాయుడైన ప్రహ్లాదుడిని రక్షించినట్లుగాను తన్ను ఉద్దరించమని తన నాథుణ్ణి దురాచారాలకు దూరం చేయమని ప్రార్థించేది. వీరందరి కోరికను మన్నించాడా ద్వారకాపురవాసి. భార్యప్రియుడైన తులసీదాసును అర్థాంగి చిన్న మాటలతోనే శ్రీరాముని వైపు మళ్లించినట్లుగా పుండరీకుడు ఓ చిన్న సంఘటనతో మనసుమళ్లించుకున్నాడు. తన జన్మను సార్థకం చేసుకోవాలనుకొన్నాడు. అపుడు తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మించిన దైవం లేదనుకొన్నాడు. వారి సేవ చేస్తే కాని తాను చేసిన పాపం ప్రక్షాళన కాదని నిశ్చయించుకున్నాడు. ఇక కాలయాపన లేకుండా తల్లిదండ్రులను సేవించడం మొదలుపెట్టాడు. ఆసేవలో తరించిపోతున్నాడా కృష్ణుని అనుగ్రహం పొందిన పుండరీకుడు.
కాని ఈ తరించిపోవడం, సేవచేయడం ఎంత ఏకాగ్రతతతో చేస్తున్నాడో చూద్దామని అలవైకుంఠపురం నుంచి శ్రీకృష్ణుడేతించాడు. తల్లిదండ్రుల పాదసేవనం చేస్తున్న పుండరీకుని చూచి ‘‘ఓ పుండరీకా.. నీతో ముచ్చటిద్దామని నీ చెంతకు వచ్చాను ’’అన్నాడు.
ఇతరములేవీ చెవిని దూరం పుండరీకుడు కృష్ణుని పిలుపును అందుకోలేకపోయాడు. మరలా మరలా పిలవగా పిలవగా ‘ఓ కృష్ణయ్యా నీవు ఇంతదూరం వచ్చావా... సరే కాని కాసేపు అటు నిలువు. నేను నా తల్లితండ్రుల సేవ పూర్తిచేసుకొని నీదగ్గరకు వస్తాను’’అంటున్నపుండరీకుని ఆశ్చర్యానందాలతో చూస్తూ నడుముకు చేయి చాయి ఓ ఇటుకపై నిల్చున్నాడా కృష్ణ్భగవంతుడు. ఆయనే పాండురంగనిగా కీర్తినొందాడు. పుండరీకుడు అపరభక్తుడుగా వందనీయుడయ్యాడు.
ఆ పాండురంగని విల్లిపుత్తూరులోని విష్ణుచిత్తుని తనయ గోదాదేవి అపరిమితానందాలతో ప్రేమించింది. తన స్నేహితులనంతా కూడకట్టుకొంది. తాను నివసించే విల్లిపుత్తూరునే రేపల్లెఅనుకొంది. తన స్నేహితులే నాటి గోపికలుగా భావించింది. ‘‘మాలే! మణివణ్ణా!మార్గళి పిరాదువాన్
మేలై యార్ శెయ్వనగళ్ వేణ్ఢువన కేట్టియేల్
ఞఅత్రె్తై యెల్లామ్ నడుఙ్గ మురల్వన.....’’ చిన్న మఱ్ఱిఆకుపై పవళించిన వాడివీనీవు, పూతన, శకటాసుర, బకాసురవంటి రాక్షసాధములను చంపిన వాడివీ నీవే అట్టినీవే అర్జునాది పాండవులను కష్టాలల్లో మునిగిపోకుండా గట్టున ఉండేటట్టుగా కాపాడినవానివీ నీవే కనుక మమ్ము ఉద్దరించుము మేమంతా నీవారలము అని పాశురాలు వ్రాసి పాడుతూ తాను ముడిచిన పూలను ప్రేమాదరముతో సమర్పించి రంగని తన నాథునిగా చేసుకొన్న గోదాదేవి అండాళ్ అమ్మ ను స్మరిస్తూ మార్గశిరమాసంలో ప్రతి వైష్ణావాలయమూ తిరుప్పావై పాడుతూ పులకించిపోతుంది. అటువంటి రంగనాథుని ఆలయంఒకటి నెల్లూరు పట్టణంలో అత్యంత ఖ్యాతిని పొంది ఉంది.
7 శతాబ్దంలో నెల్లూరు పట్టణాన్ని పాలించిన పల్లవులు శ్రీరంగనాథుని తల్పగిరి క్షేత్రంలో కొలవడానికి వీలుగా అర్చారూపంలో ప్రతిష్టించారట. నల్లని ఆకారంలో శయనించిన రూపంలో వున్న శ్రీరంగనాథుడే ఒక్క నెల్లూరు వాసులకే కాక యావత్ ప్రపంచంలోని భక్తులందరినీ ఆకట్టుకొనే రూపం గలవాడు. ఈ ఆలయ అభివృద్ధికి కుళోత్తంగ చోళుడనే నరేంద్రుడు కూడా సహకరించాడని శాసనాధారాలు తెల్పుతున్నాయి.
పెన్నానది సమీపంలోని ఈ రంగనాథుని పాండ్యులు కూడా సేవించినట్లు చరిత్ర. ఈ రంగనాథుని ఆలయంలో నేటికీ నిత్యకల్యాణోత్సవాలతో కిక్కిరిసిన భక్తగణంతో వైభవోపేతంగా కనిపిస్తుంది. ధనుర్మాసంలో తిరుప్పావైను అనుసంధానించడం, ముక్కోటి ఏకాదశి క్షీరాబ్ధి ఇటువంటి పర్వాలను బ్రహ్మోత్సవాలను విశేషంగా జరుపుతారు. పరమశివుడు శ్రీమహావిష్ణువును , మహావిష్ణువుపరమశివుణ్ణి ధ్యానం చేస్తున్నట్టుగానే ఇక్కడా శ్రీరాముడు శ్రీరంగణ్ణి, శ్రీరంగడు శ్రీరాముణ్ణి నిత్యం ధ్యానం చేస్తున్నారని తెలియపర్చడానికా అన్నట్టు శ్రీరంగనాయకుల మందిరంలో శ్రీసీతాలక్ష్మణ హనుమత్ సమేత కోదండరామస్వామివారు వేంచేసియున్నారు. ఈ శ్రీరంగనాయకులనే తమిళులు పళ్లికొణ్ణ స్వామిగా కీర్తిస్తారు. ఈ క్షేత్రానే్న తల్పగిరి క్షేత్రంగా పిలుస్తారు. ఈ శ్రీరంగనాయక క్షేత్రం ఉత్తరశ్రీరంగంగా ప్రసిద్ధి చెందింది. పండరీపురాన్ని ఆదిరంగంగా గుర్తిస్తే కన్నడదేశంలోని శ్రీరంగనాయక గుడి మధ్యశ్రీరంగంగా కూడా పిలుస్తారు. దేదీప్యమానంగా వెలుగొందే ఈ శ్రీరంగనాథుని ఆలయం గాలి గోపురం సుమారు 70 అడుగుల ఎత్తున భక్తులను ఆకర్షిస్తూంటుంది.
మహిమోపేతమైన శ్రీరంగనాయక మందిరంలోని పవళించిన ఈస్వామిని దర్శించిన వారిక మోక్షం కలుగుతుందని భక్తులకథనం. పైగా ఈ స్వామి పిలిస్తే పలికే స్వామిగా కూడా కీర్తింబడుతున్నారు.

- ఎస్. నాగలక్ష్మి