Others

మాఘస్నానం... పరమపవిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మాఘ మాసంలో స్నానానికి ఎంతో పవిత్రత ఉంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం, ఉత్తరాయణ పుణ్యకాలంవల్ల మాఘమాసంలో పుణ్య నదుల్లో స్నానంచేసి శివకేశవులను పూజించాలనీ, దానధర్మాలు చేయాలనీ పెద్దలు చెప్పారు. సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయడమే మాఘమాసం స్నానంప్రత్యేకం. మాఘ స్నానం గురించి పద్మపురాణం వివరిసతుంది. మాఘస్నానం చేయడంవల్ల బుద్ధివికాసం, ఆరోగ్యం, అందం, ఐశ్వర్యం పెంపొందుతాయని శీలవంతులుగా ఉంటారని పద్మపురాణం తెలుపుతుంది.్భతికంగా కూడా స్నానం అనేది చర్మకాంతిని పెంపొందిస్తుంది. శరీరం, మనస్సు పరిశుద్ధమవుతాయి. సోమరితనం, అలసట తొలగిపోయి శరీరంలో ఉల్లాసం, చురుకుదనం ప్రవేశిస్తాయి. సూర్యకిరణాలలో శక్తి వల్ల దేహంలోని కొన్ని రుగ్మతలనుదూరమవుతాయ. అందుకే నదులలోను, చెరువులలోను, బావిలోనూ లభించే నీటితో మాఘస్నానంచేయమని చెప్పారు. ప్రవాహజలాలల్లో స్నానం చేయలేని వారు ‘గంగేచ యమునేచవ గోదావరి, సరస్వతి, నర్మదే సింధుకావేరి జలేస్మిన్ సన్నిధింకురు’ అన్న శ్లోకాన్ని పఠిస్తూస్నానం ఆచరిస్తే మాఘస్నానపుణ్యం లభిస్తుందని అంటారు. ప్రతిరోజు స్నానమాచరించలేనివారు కనీసం మాఘ శుద్ధ సప్తమి, ఏకాదశి, పౌర్ణిమ, కృష్ణపక్ష చతుర్దశి రోజుల్లో స్నానం చేసి, మాఘమాస స్నాన ఫలితాన్ని పొందవచ్చు. మాఘశుద్ధ ఏకాదశి, మాఘ మాసంలో శ్రేష్ఠమయిన రోజు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన దినం కనుక ఉపవాసం చేసి వైష్ణవాలయానికి వెళ్లి మహావిష్ణువును దర్శనం చేసుకొంటారు. మాఘశుద్ధ ఏకాదశినాడు ఉపవాసం చేసినట్లయితే, ఇరవైనాలుగు ఏకాదశులు ఉపవాసం చేసిన పుణ్యఫలం లభిస్తుంది.
మాఘమాసం శివకేశవులిరువురికీ ఫూజించవలసిన పుణ్యమాసం. స్నానం, జపం, ధ్యానం, దానంవల్ల ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుందనీ, భగవంతుని నామస్మరణవల్ల పాపచింతన తొలగిపోయి, భగవత్ చింతన ఏర్పడి మంచి కార్యాలు చేస్తారనీ, వారికి ఆ పుణ్యఫలంవల్ల మోక్షం లభిస్తుందనీ పురాణా వచనం. పద్మపురాణంలో అరటిపళ్లు, చెరకు గడలు, ఉప్పు, చక్కెర, పాలు, నిమ్మ, దబ్బపళ్ళు, పెరుగు, తేనె, బెల్లం, భగవంతుని పూజాసామగ్రి, శంఖం, వినాయకుడు, దుర్గాదేవి ప్రతిమలు దానంచేయాలి. ఇవేకాక, శొంఠి, జీలకర్ర, జాజికాయ, పిప్పళ్ళు లాంటివి ఈ మాఘమాసంలో దానం చేస్తే మంచిదని అంటారు.

- కౌతా నిర్మల