Others

మన సంపదను మనమే రక్షించుకుందాం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందువులు తమ తల్లి తర్వాత తల్లి స్థానాన్ని ఇచ్చి ఆవుని గోమాత అని గౌరవంగా పిలుస్తూ పూజిస్తారు. కంప్యూటర్ యుగంలో ఎంతో శాస్త్ర విజ్ఞానంతో ముందుకు పోతున్న మనం, చదువు, సంస్కారం, విజ్ఞత, విచక్షణలున్న మనం గోవును ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో మనకు వేదాలు, పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయ. సర్వులూ గోవును రక్షించాల్సిన అవసరపు క్షణాలు మనకు ఇపుడు వస్తున్నాయ. గోవు కూడా ఒక జంతువే కానీ ప్రపంచంలో మరే జంతువుకు లేని చాలా ప్రత్యేకతలు గోవుకున్నాయి.
ఇంటిముందు ఒక్క ఆవుంటే ఒంట్లో ఒక్క రోగం కూడా ఉండదు. ప్రాణవాయువు (ఆక్సిజన్)ను పీల్చుకుని ప్రాణవాయువును వదిలే ఏకైక ప్రాణి దైవస్వరూపం గోమాత. విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది. వైద్య శాస్త్రానికే అర్ధం కాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమికొట్టగల శక్తి గోమాతది. ఆవునెయ్యి, బియ్యం రెండూ కలిపి వేడిచేస్తే ఇథలిన్ ఆక్సైడ్, ప్రొపలీస్ ఆక్సైడ్ అనే శక్తివంతమైన వాయువులు విడుదలవుతాయి. కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రోపలీస్ ఆక్సైడ్ శ్రేష్టమైనది. గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమ కీటకనాశిని. గోవుపేడ, మూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులను నయం చేయవచ్చు. ఇళ్లను వాకిళ్లను ఆవుపేడతో అలికితే రేడియో ధార్మిక కిరణాలనుండి మనల్ని కాపాడుకోవచ్చు. ఆవుపేడలో కలరా వ్యాధిని వ్యాపింపచేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది. భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచంలో ఒక్క భారతదేశంలో తప్ప మరెక్కడా కనిపించదు
గోరక్షణవల్లనే మన జాతి మన ధర్మం రక్షింపబడును. గోసంరక్షణ స్వరాజ్య సముపార్జన కంటే ఏమాత్రము తక్కువ కాదు అని ఎంతో మంది పెద్దలు వాక్రుచ్చారు. ఆవుపాలల్లో, ఆవు నెయ్యిలో అమృతం ఉంది. ఆవుఇచ్చే ప్రతి పదార్థమూ మనకు అమూల్యమైనదే. భారతదేశంలో నివసించే వాళ్లందరూ భారతీయులే. దేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడం అందరి ధర్మం. మనం బతకాలి అంటే గోమాతను బతికించాలి. ఎంతో శక్తివంతమైన గోమాతను కాపాడుకోవడం భారతీయుల ప్రథమ కర్తవ్యం.

-కాకరపర్తి సుబ్రహ్మణ్యం