ధర్మసందేహాలు

ధర్మసందేహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తండ్రి ఆబ్దికం పెట్టవచ్చా?

* నా కుమార్తె మరణించినది. భర్త జీవించి వున్నాడు గానీ తద్దినాలు పెట్టడం లేదు. వాని కూతురు వర్ణాంతర వివాహం చేసుకుంది. మగ సంతానం లేదు. నేను నా కూతురికి ప్రతి సంవత్సరం తద్దినం పెట్టవచ్చునా? ఫలితం వుంటుందా?
- శశిభూషణరావు, శ్రీకాకుళం
ఆమె మరణ సమయంలో భర్తమీద కర్తృత్వం వేసి కర్మలు జరిపి వుంటారు. కనుక, ఆ భర్తమీది కర్తృత్వంతోనే మీరు మీ అమ్మాయికి ఆబ్ధికాలు చేయవచ్చు. ఫలితం వుంటుంది.
* ప్రతి మనిషీ తప్పకుండా కాశీ వెళ్ళాలని పెద్దలు చెపుతున్నారు. వెళ్ళలేనివారు ఏం చేస్తే మంచిది?
- యన్.సురేంద్ర, కొత్తగాజువాక
జన్మలో ఒక సారయినా కాశీకి వెళ్ళిరావటమే ఉత్తమం. అది బొత్తిగా కుదరని పక్షంలో మనకు దగ్గరలోవున్న శ్రీశైలం, శ్రీకాళహస్తి, ముక్తేశ్వరం వంటి మహాక్షేత్రాలు దక్షిణకాశిగా ప్రసిద్ధిచెంది వున్నాయి గనుక, ఆ క్షేత్రాలకు వెళ్ళి అసలు కాశీకి వెళ్ళలేకపోతున్నానని, ఆ శక్తిని ప్రసాదించమనీ అక్కడి శివుడ్ణి వేడుకోవటం ఉత్తమం.
* మానవధర్మ పరమార్థాన్ని తెలిపిన రామాయణాన్ని వదలి కోర్టులలో భగవద్గీతపై ప్రమాణం చేయిస్తారెందుకో?
- వి.బాలకేశవులు, గిద్దలూరు
మనకు అనేక ఉత్తమ గ్రంథాలున్నాయి. ఒకటి కాదు! వాటిలో ఒకదానిపై ప్రమాణం చేయిస్తున్నందుకు సంతోషించక, ఈ భేదభావ జనకమైన ఆలోచన ఎందుకు?
* గాయత్రీ జపం 24 లక్షలు చేయాలని వుంది. దాని విధానమేమిటి?
- ఐ.జగదీష్, పరకాల
మామూలుగా నిత్య జపం ఎంత చేస్తారో అంతా చేసుకుని, నిత్యానుష్టానాలన్నీ పూర్తిచేసి- విడిగా ‘‘అక్షరలక్షగాయత్రీ జపం యథాశక్తి కరిష్యే’’అని సంకల్పం చెప్పుకొని, గాయత్రీ కల్పగ్రంథంసంపాదించి, దానిలో చెప్పిన విధంగా కవచ, పంజర, హృదయ, స్తోత్ర, మాలామంత్రాది పారాయణలు చేసి, భోజనాత్పూర్వం వరకు ఎంత జపం చేయగలరో అంత చేయాలి. ఈ జపానికి ప్రత్యేక జపమాల వాడటం మంచిది. భోజనానంతరం జపం పనికిరాదు. 24 లక్షలు పూర్తయినాక తర్పణహోమ, అన్న సంతర్పణలు చేయాలి. ఇతర వివరాలన్నీ గాయత్రీ కల్పగ్రంథంలో వుంటాయి.
* నామస్మరణ ఎవరైనా ఎప్పుడూ చేయవచ్చునా? - మురళీమోహన్,
ఎవరైనను నామస్మరణ ఎల్లవేళలా చేయవచ్చు.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా:
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.
vedakavi@serveveda.org

కుప్పా వేంకట కృష్ణమూర్తి