పర్యాటకం

భక్తవత్సలుడు .. ఓధెల మల్లికార్జునుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ పట్టణానికి నలభై కిలోమీటర్లు దూరంలో ఓదెల ప్రాంతంలో కొలువుదీరిన మల్లికార్జునుడు భక్తవత్సలుడు. ఈ ప్రదేశమంతా ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. ఆహ్లాదపరిచే వాతావరణంలో పరమేశ్వరుని పూజ నిరాటంకంగా ఏకాగ్రతతో సాగుతుండడంతో భక్తుల కోరి మరీ వచ్చి ఈ ఓదెల మల్లికార్జునుని దీవెనలందుకుంటారు. ఈ ఓదెల మల్లి కార్జునినునికి ఏటా మాఘ బహుళ ద్వాదశి నుంచి ఆషాడ బహుళ అష్టమివరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

పిలిస్తే పలికే దైవం పరమేశ్వరుడు. రాక్షసులనైనా, మానవులైనా, దేవతలనైనా అపారమైన కృపావీక్షణాలతో సర్వసృష్టిని చల్లగా కాపాడే దైవంగా ప్రఖ్యాతి వహించిన పరమేశ్వరుడు భక్తులకోరిక మేరకు ఓసారి మల్లికార్జునుడిగా కరీంనగర్ జిల్లా పట్టణానికి నలభైకిలోమీటర్లు దూరంలో ఓదెల అన్న ప్రదేశాన్ని తన ఉనికిచాటుతున్నాడు. అసలీ ప్రదేశ మంతా ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. ఆహ్లాదపరిచే వాతావరణంలో పరమేశ్వరుని పూజ నిరాటంకంగా ఏకాగ్రతతో సాగుతుందని భక్తుల కోరి మరీ వచ్చి ఈ ఓదెల మల్లికార్జునుని దీవెనలందుకుంటారు. ఈ ఆలయం అతిపురాతనమైనదిగా ఇక్కడి స్థానికులు చెప్తుంటారు. కాకతీయుల కాలం నాటనే ఈ దేవాలయానికి జీర్ణోద్ధరణ కార్య క్రమాలు జరిగేవనీ అంటారు. ఈ ఆలయంపైన ఉన్న సుందరమైన శిల్పకళ చాళుక్యుల శిల్పకళను గుర్తుకు తెప్పింస్తుంది. ఈ ఆలయ చరిత్రకూ ఓ ఆసక్తికరమైన గాధను భక్తులుచెప్తుంటారు. ఒకానొక కాలంలో ఓదెల అనే రైతు తన వ్యవసాయ పనికోసం ఓం నమఃశివాయ అన్న నామస్మరణతో భూమిని దున్నుతుండేవాడట. ఓసారి అలా దున్నుతుండగా నాగలికి ఏదో తగిలినట్టు అనిపించింది. మరోసారి గట్టిగా ఓం నమఃశివాయ అని బలంగా భూమిలోకి నాగలిని జొనిపాడట. అంతే ఆ నాగలి భూమి పొరల్లో నిక్షిప్తంగా ఉన్నా ఓ శివలింగానికి తగిలి ఆ లింగం కాస్త చిధ్రమై పోయందట. దాన్ని చూచిన ఓదెల నిలువునా కంపించిపోతూ నమఃశివాయ నామోచ్చారణను మరింత గట్టిగా అననారంభించాడట.
ఆ ఓదెల కళ్లు కాలువలై పారుతుండగా కాయం గజగజవణుకుతూ పరమేశ్వరుని చూస్తున్నదట. ఆ శివలింగపు భాగాలను పట్టుకొని అదేపనిగా ఏడుస్తున్న ఓదెలను చూచి పరమేశ్వరుడే కరిగి నీరయ తన ఎదురుగా వచ్చాడట. ఓ ఓదెలా ఆ కన్నీళ్లు ఆపు. నేనిక్కడ ఉన్నాను చూడు అంటూ భక్తదయాళుడు, భక్తవత్సలుడైన కైలాసపతి ఓదెలను ఓదార్చాడట. దానితో కన్నీళ్లలను తుడుచుకుంటూ పరమేశ్వరా నేను చేసిన ఈ దురాగతానికి నన్ను శిక్షించు అని పదే పదే అడుగుతుండగా భక్తప్రియుడైన పార్వతీ ప్రియుడు ఓదెల నిన్ను క్షమించనక్కర్లేదు. నేనే ఈ లింగరూపంలో ఇక్కడే నీకోసం కొలువై ఉంటాను. ఇకలే నేను చెప్పే మాటలు విను అని భక్తుని కార్యరంగంలోకి దింపాడట ఆ శంకరుడు.
ఇట్లా నిలిచిన ఈ స్వామికి ఓదెలతోసహా ఊరివారందరూ చక్కటి దేవాలయ నిర్మాణం చేశారు. ఈ మహాదేవుని కరుణను పొందడానికి అనేకమంది రాజులు ఉన్నతమైన రాజగోపురా లను కట్టి వృషభవాహనుని కృపను పొందారని ఇక్కడి స్థలపురాణం చెబుతుంది. ఈ ఆలయ గోపురం మీద జ్ఞానమే భగవంతుడని చెప్పడానికా అన్నట్టు దక్షిణామూర్తి కూడా ఆసీనులై దర్శనమిస్తారు. ఈ ఆలయంలో పరమశివుని వాహనమైన నంది భారీ ఆకారంలో దర్శనమిస్తాడు. ఈ నంది దర్శనం తరువాత ధ్వజస్తంభం- ఈ ఆలయం లోని ప్రధానాలయ ప్రాంగణం విశాలమైనది. నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. ఈ ప్రాంగణంలోనే భారీ ఆకారంలో ఉన్న నంది విగ్రహమూ కానవస్తుంది. అనేక స్తంభరాజాలతో కూడుకుని ఉన్న విశాలమైన మండపం కనబడుతుంది. ఇక్కడే ధ్వజస్తంభం కూడా విరాజిల్లుతోంది. దీనికి సమీపంలోనే ఆంజనేయుడు కొలువై శివకేశవులకు భేదం లేదని రామనామజపంలో శివ దర్శనం చేస్తుంటాడు. ఇక్కడి పరమశివుడు ఒదెలను ఓదార్చినందున ఓదెల కోరిక మేరకు వెలసినందున ఓదెల మల్లికార్జునిగా పేరు గాంచుతున్నాడు. ఈ ఓదెల మల్లికార్జునుని గర్భాలయానికి ముందే సర్వగణాలకు అధిపతి, ప్రథమపూజార్హుడైన విఘ్నేశ్వరుడు కొలువై భక్తులకు శివదర్శనం లభించడంలో సాయం అందిస్తుంటాడు. శివభక్తులైన శృంగి, భృంగి కూడా ద్వారపాలకులై స్వామివారిని సేవిస్తుం టారు. అర్థనారీశ్వరుని సతియైన పార్వతీదేవి ఇక్కడ భ్రమరాంబాదేవిగా దర్శనం ఇస్తుంది. సర్వాభరణ భూషితురాలైన ఈ తల్లి దర్శనం సర్వమంగళకరమని భక్తుల భావన. ఈ ఆలయంలోనే మరో ప్రాంగణంలో దక్షయజ్ఞ ధ్వంసి అయన వీరభద్రుడూ కొలువై దర్శనమిస్తాడు. ఈ వీరభద్రుని సమీపంలో భద్రకాళి, గంగ, పార్వతీ మాతలు కూడా కొలువై ఉండడంతో వీరభద్రస్వామి అభీష్టవరప్రదుడిగా భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడే నవగ్రహాలయం ఉంది. గండాలను దూరం చేయడానికి ఇక్కడ గండదీపం వెలుగుతూ ఉంటుంది. ఈ గండదీప దర్శనం కాని ఈ దీప ప్రజల్వనం కాని అప మృత్యుదోషం పోగొడుతుందని భక్తులంటారు.. ఈ సమీపంలోనే రాములవారు సతీసోదర సమేతంగా దర్శనం ఇస్తారు. వనవాసకాలంలో రాములవారు స్వామిని సేవించిన తార్కాణంగా ఇక్కడ దర్శనమిస్తారని స్థానికుల కథనం. స్వామిని దర్శించినవారు కోడెలను సమర్పిం చటం ఈ ఆలయ ప్రత్యేకత. ఈ ఓదెల మల్లి కార్జునినునికి ఏటా మాఘ బహుళ ద్వాదశి నుంచి ఆషాడ బహుళ అష్టమివరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మహాశివ రాత్రినాడు మరిన్ని విశేష అర్చనలు, సహస్రనామాలు అభిషేకాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ఓదెల మల్లికార్జున స్వామి దర్శనానికి కరీంనగర్ వరకూ వచ్చి అక్కడనుంచి ఏదైనా వాహనంలో చేరుకోవచ్చు. వరంగల్‌నుంచి కూడా నేరుగా ఇక్కడికి చేరుకోవచ్చు. కాచిగూడ-బలార్షా మార్గంలో ఈ దివ్యక్షేత్రం అలరారుతోంది.

- చివుకుల రామ్మోహన్