Others

అద్వైతామృతాన్ని పంచిన శంకరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘్ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠితః’’ జగత్తును నడిపేది ధర్మం. ‘్భక్తి’్భవం అనేకత్వంలోంచి ఏకత్వం, ఏకత్వంలో అనేకత్వాన్ని దర్శింపచేసే వెలుగును, చైతన్యాన్నిస్తుంది. ఇదిగో ఈ భిన్నంలో అభిన్నాన్ని దర్శించటానే్న ‘అద్వైత’ మన్నారు. దీన్ని బోధించిన జగద్గురువు- శంకరాచార్యులు. మానవ జాతి బహుజన్మల నోము ఫలం- జగద్గురు శ్రీమచ్ఛంకర భగవత్పాదుల అవతారం. అద్వైతామృతాన్ని అందరికీ ఆమోదయోగ్యమైన పద్ధతిలో అందించి, పరిపూర్ణ మానవత్వాన్ని ఆవిష్కరించిన మహోన్నతుడు శ్రీ శంకరులు. ఆదిశంకరులు గొప్ప దార్శనికులు, మేధావి, కరుణామూర్తి, సామాజిక సంస్కర్త, ఉత్తమ సహనశీలి. భారతీయ విజ్ఞాన వైభవాన్ని , ఆర్ష ధర్మ ఔన్నత్వాన్ని- అసాధారణ ప్రజ్ఞాపాటవాలతో ప్రస్ఫుటీకరించిన మహనీయుడు శ్రీ ఆదిశంకరులు.
జీవిత ఆదర్శం
తాను జీవించిన పరిమితకాలంలోనే, అనన్య సాధ్యమైన అద్భుత కార్యములను నిర్వహించి, దేశమంతా విస్తృతంగా పర్యటించి నాలుగు దిక్కులలో చతురామ్నాయ పీఠములను స్థాపించి, శతాధిక గ్రంథములను, స్తోత్రములను వెలయించి, అందరిలోనూ ఉన్నది ఒకే చైతన్యమని, అదే పరమాత్మ అని, అనేకత్వంలో ఏకత్వాన్ని, ఏకత్వంలో అనేకత్వాన్ని దర్శింపజేసి, ‘్ధర్మం’ అనే సమన్వయాత్మక మహత్తర శక్తితో వ్యక్తి, కుటుంబ, సమాజ, విశ్వశాంతిని నెలకొల్పిన మహనీయుడు ఆదిశంకరులు.
బాల్యం
శంకరులు క్రీ.శ.788 సంవత్సరములో కేరళలోని ‘కాలటి’ అనే బ్రాహ్మణ అగ్రహారంలో ఆర్య, శివగురువు అనే పుణ్య దంతులకు ఈశ్వరానుగ్రహముగా జన్మించినారు. శంకరుని అసాధారణమైన బుద్ధికుశలతను గమనించిన తండ్రి శివగురువు. మూడేళ్ళకే అక్షరాభ్యాసం చేశాడు. ఐదు ఏళ్ళు వచ్చేసరికి విద్యలన్నీ పూర్తిచేశాడు శంకరుడు. ఉపనయనం గావించి గురుకుల విద్యకు పంపించాడు.
కనకధారాస్తవం
గురుకులంలో విద్య నేర్చుకునేటప్పుడు ఆ వూరిలో భిక్షాటన చేస్తూ ఒక పేద బ్రాహ్మణుని ఇంటిముందు నిలుచుని ‘్భవతీ భిక్షాందేవి’ అన్నాడు. పండిన ఉసిరికాయలు మాత్రం ఇవ్వగలిగిన ఆ ఇల్లాలు దారిద్య్రాన్ని తలచి దుఃఖిస్తూ దానే్న శంకరుని భిక్షాపాత్రలో ఉంచింది. దారిద్య్రాన్నిచూచి కలత చెందిన శంకరులు సిరులనిచ్చే శ్రీమహాలక్ష్మిని కనకధారాస్తవంతో ప్రార్థించాడు. పేదరాలి దారిద్య్రాన్ని పోగొట్టాడు.
సన్యాసాశ్రమ స్వీకారం
‘‘అమ్మా నీవు అనుమతిస్తే సన్యాసం పుచ్చుకొని ధర్మాన్ని రక్షించే నా పనిని ప్రారంభిస్తాను’’ అన్నాడు శంకరాచార్యులు. ‘‘ఈ విద్వత్తు విషయాలు నాకేం తెలియదు నాయనా. నన్ను పిడికెడు బుగ్గి, నేపోతే ఎవరు చేస్తారు అన్నది. ‘నేను చేస్తా’నన్నాడు శంకరాచార్యులు. ‘నీ తరువాత’? నా తరువాత హిందూ ధర్మం యావత్తూ వుంది. నీ కీర్తిని, నీ సద్గుణాలను చాటుతుంది. అదే అసలైన శ్రాద్ధాదులు అంటూ తల్లికి నచ్చచెప్పాడు.
నదిలో మొసలి శంకరుల కాలు పట్టుకోవటం- కుండలినీయోగానికి సంబంధించినది. స్వాధిష్ఠానం-జలతత్వం. సంసారాన్ని సాగరంగా అందులో తిరుగాడే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములే జీవులను గ్రహించే మొసలిగాను, మానసికంగా అన్ని లౌకిక బంధాలు సన్యసించటంవలన జీవుడు సంసార విముక్షుడవుతాడన్నది అంతరార్థం.
నర్మదానదికి వరదలు:గౌడపాదాచార్యుల సందర్శనం
సన్యాసాశ్రమం స్వీకరించి, గురువుని అనే్వషిస్తూ బయలుదేరాడు. శంకరాచార్యులు. నర్మదానది ఒడ్డున అమరకాంతంలో ఆశ్రమం కట్టుకొని ఉంటున్నాడు గోవిందాచార్యులు. నర్మదానదికి బీభత్సమైన వరదలు వచ్చాయి. సర్వప్రాణులు అతలాకుతలం అవుతుంటే శంకరుడు నర్మదా అష్టకం చదివి నర్మదానదిని శాంత పరిచాడు. ‘ఆత్మలన్నీ ఒక్కటే, బ్రహ్మమొక్కటే’ అన్న స్థితికి వచ్చాడన్న నమ్మకం గోవిందపాదాచార్యులకి కలిగింది. గురుదేవులయిన గౌడ పాదాచార్యుల దర్శనం చేయటానికి శంకరుని తీసికొని వెళ్ళాడు.
బదరీనారాయణ ఆలయ నిర్మాణం
తల్లి ఆర్యాంబ అగ్నిశర్మ ద్వారా ధనం పంపి ఆమె ఆఖరి ఘడియలు లెక్కపెడుతూ కూచుంది అన్నాడు. ఆ ధనంతో 23000 అడుగుల ఎత్తున ఉన్న ప్రదేశంలో బద్రీనాథ్ ఆలయం నిర్మించారు శంకరులు. బద్రీనాథుని దర్శించిన ప్రతివారూ, ఆదిశంకరులకు, ఆయన తల్లి ఆర్యాంబకు నమస్కరిస్తారు. బద్రీనాథునికి భోగం సమర్పిస్తున్న బంగారు గినె్న శంకరాచార్యులిచ్చిందే. ఈనాటికీ దర్శించవచ్చు. ఈనాటికీ అగ్నిశర్మ వంశస్థులే బద్రీనాథంలో పూజారులై ఉన్నారు. విష్ణుశర్మతో కలిసి, శంకరాచార్యులు తల్లి దగ్గరకు బయలుదేరారు.
తల్లికి దహన సంస్కారాలు
తల్లికోసం పూర్ణానదిని వారి గుమ్మం ఆనుకుని ప్రవహించేటట్లు చేశారు. ‘‘శంకరా ధర్మం తెలిసినవాడివి, నాకు కూడా కొంచెం ధర్మం బోధించ’’మని అడిగింది ఆర్యాంబ. కృష్ణాష్టకం వ్రాసి తల్లికి వినిపించాడు. భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఆమె ఆత్మ పరమాత్మలో లీనమైపోయింది.
స్తోత్రములు:పంచాయతన పూజ
గణపతి, అంబ, శివ, విష్ణు, సూర్యులు- ఈ ఐదుగురిని పూజించటానికి పంచాయతన పూజ ఏర్పాటుచేసి ‘ఈశావాస్యమిదం సర్వం’ ఉండేది దేవుడొక్కడే అనే సత్యాన్ని బోధించి భిన్నంలో అభిన్నాన్ని అనగా అద్వైత సిద్ధాంతాన్ని నిరూపించాడు.
విష్ణుసహస్రనామం, దక్షిణామూర్తి స్తోత్రం
విష్ణు సహస్రనామానికి భాష్యం వ్రాస్తూ ‘విష్ణు’ అనే నామముతో ఆరంభించక ‘విశ్వ’ నామముతో ప్రారంభించబడటం, విశ్వానికి-విష్ణువునకు అభేదమని తెలుపటయే, ముందుగా విశ్వమును దర్శిస్తేగాని విష్ణువుని గూర్చి తెలిసికోలేరు.విశ్వం విష్ణువు ఈ రెండు అభేదములే అన్న అద్భుతమైన భావన అందించిన మహనీయులు. పేరులో ‘మూర్తి’ అని ఉన్నా నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం ఎలా అవుతుందో, అద్వైత సిద్ధాంతాన్ని వ్యక్తపరుస్తూ అందించిన దక్షిణామూర్తికి మకుటాయమానమయింది.
వనదుర్గా మహామంత్రంతో శారదాదేవిని ఆవాహనం చేసి శృంగేరిలో ప్రతిష్ఠించారు. తిరుమలలో స్వర్ణాకర్ష భైరవ యంత్ర స్థాపన చేశారు. భీకర రూపాన్ని శాంతింపచేస్తూ విజయవాడ కనకదుర్గమ్మ వద్ద శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేశారు. భజగోవింద శ్లోకాలు, వివేకచూడామణి, ..... శివానందలహరి, సౌందర్యలహరి- యిలా ఎన్నో అమృత వర్షిణులైన గ్రంథాల్ని వెలయించారు.
మీమాంస శాస్త్రం
సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అన్నవి వేదవాఙ్మయంలోని ఆరు దర్శన (షడ్దర్శనములు) శాస్తమ్రులు. తాను రచించిన భాష్యాలలో ఆదిశంకరాచార్యులు మీమాంస అధికరణాలను ఉటంకించటం విశేషం. న్యాయ ప్రక్రియకు ఎంతో ఉపయోగం.
నాటికి, నేటికి ఏనాటికి శుభకరమైన శ్రీ శంకరుల మార్గంలో నడుస్తూ సర్వమానవ సౌభ్రాతృతతో విశ్వమానవ కళ్యాణాన్ని వీక్షిస్తూ మానవత్వాన్ని సమానత్వాన్ని కాంక్షిస్తూ, అడుగుతనాన్ని బడుగుతనాన్ని దూరంగా నెట్టివేసి అందరిలో పరమాత్మను సందర్శించటమే మానవాళి లక్ష్యం కావాలనేది ఆదిశంకరుల మాట సదా అనుసరణీయం.

- పసుమర్తి కామేశ్వర శర్మ