మెయిన్ ఫీచర్

గో రక్షణే గోపాలుని పూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరికి వారు బతకడమంటే ఇతరులకు సాయపడడమే అన్న నీతిని బోధించేది భారతీయం ప్రకృతిని పరిరక్షించమని పదే పదేచెప్తుంది. వనస్పతియః శాంతి అని చెట్లను రక్షించేమనే భారతీయ సాంఫ్రదాయం ఉదయానే్న గోమాత దర్శనం స్పర్శనం చేయమంటుంది. గోవులను రక్షించడం ప్రథమ కర్తవ్యమని చెప్తుంది.
గాలి, నీరు, చెట్లు వీటిలో ఏఒక్కటి తనకోసం తానుబతకదు ఇతరుల కోసం సర్వాన్ని త్యాగం చేస్తుంది. అటువంటివాటి నీడలో అటువంటి వాటి సాయంతో బతికే మనిషి త్యాగి కాక మరేమవుతాడు? ప్రకృతి నేర్వని పాఠాలు ఏవీ ఉండవంటారు విజ్ఞులు. వన్యప్రాణులను, వనాలను రక్షించే మనిషికి ప్రకృతి రక్షణ నిస్తుంది.
ఉదయాన్ని నిద్రలేవగానే మున్ముందుగా భూమాతకు వందన మాచరించి, కన్నతల్లి పాదాలకు నమస్కరించి, గోశాలలో ఉన్న గోమాత పృష్ఠ భాగాన్ని కనులకద్దుకోవడం విధివిధానాలు ముఖ్యమైనది. దేవాలయాల్లో కూడా సుప్రభాత సేవలో గోమాత సన్నిధిని కల్పిస్తారు. పురాణేతిహాసాల్లో గోవు గొప్పదన్నాన్ని గురించి విపులంగా చెప్పి ఉన్నారు.
అటువంటి గోవు ఇచ్చే పంచగవ్యాలు మానవులకు మహోన్నత పుష్ఠిని, శక్తిని ప్రసాదిస్తాయ. ‘‘మహాస్తపేవ గోర్మహిమా’’- గోవును గురించి చెప్పడానికి వేయనోర్లునా తక్కువనే పరమార్థాన్ని శతపథ బ్రాహ్మణం అంటే ‘‘్ధను సదనం రజీణాం’’- సర్వసంపదలకు మూలము గోవు అంటుంది అధర్వణ వేదం.
రోజు గోసేవ చేయడం అంటే అశ్వమేధ యాగం చేసిన పుణ్యం వస్తుందంటుంది పరాశర స్మృతి .
‘‘తృణోదకాది సంయుక్తం యః ప్రపద్యాత్ గవాహ్నికమ్
సోగ్మేధ సమం పుణ్యం లభతే నాత్ర సంశయః’’
‘‘లోక కళ్యాణం కోసం భగవంతుడు మానవులకిచ్చిన వరప్రసాదం గోవు. గోవు పట్ల మానవులు చూపే ప్రేమను గ్రహించి అంతకు పలు రెట్లు అధికంగా మనకు ఫలాలను ఇస్తుంది గోమాత’’ అంటారు ఆచార్య వినోబాభావే.’’ చారిత్రక పురుషులందరూ కూడా గోరక్షణ భారతీయుల ప్రథమ కర్తవ్యం అని నినదించారు.
మన ప్రాచీన ఋషులు గోమాతను గురించి ఆధ్యాత్మిక పరంగా, విజ్ఞాన శాస్తప్రరంగా చెప్పిన విషయాలు పాశ్చాత్య పండితులు, విజ్ఞాన శాస్తవ్రేత్తలు పరిశీలించి, పరిశోధించి భారతీయ ఋషుల ప్రజ్ఞను కొనియాడేరు.
కాని నేడు గోరక్షణ చేయాల్సిన మానవులు కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారు. అందుకే గోవులు కబేళాలకు తరలించబడుతున్నాయ. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం మనందరిపైనా ఉంది.
మనం పుణ్యక్షేత్రాలకు వెళ్లి, పుణ్యపురుషులను దర్శించి, వారి సన్నిధానంలో గడిపి, వారి సత్సంగంలో ఉండి, మనలో మంచిని పోషించుకుంటాము. ఇవన్నీ అవసరం లేకుండానే ప్రతిరోజు చేసే తల్లితండ్రుల సేవకాని, గోసేవ భగవంతునికి ఎంతో ప్రీతిని కలుగచేస్తుంది. కర్మసిద్ధాంతానికి పెద్ద పీట వేసే హైందవం మనిషిని మనిషిగా బతకమని చెప్తుంది. ముక్తిని కోరడం కన్నా ముందున్నవారికి రక్షణ కల్పించడమే మేలన్నది పెద్దల మాట.

- కె. యాదయ్య